ఓ మృతదేహం(Dead Body) పాడవ్వకుండా ఎన్నాళ్లు ఉంటుంది? మహా అయితే ఓ వారం రోజులు. అప్పటికీ దుర్వాసన వచ్చేస్తుంది. కానీ నాలుగేళ్లుగా ఓ మృతదేహం చెక్కు చెదరకుండా అలాగే ఉంటే... అది అద్భుతమే కదా! ఇలాంటి అద్భతం అమెరికాలో(America) చోటు చేసుకుంది

ఓ మృతదేహం(Dead Body) పాడవ్వకుండా ఎన్నాళ్లు ఉంటుంది? మహా అయితే ఓ వారం రోజులు. అప్పటికీ దుర్వాసన వచ్చేస్తుంది. కానీ నాలుగేళ్లుగా ఓ మృతదేహం చెక్కు చెదరకుండా అలాగే ఉంటే... అది అద్భుతమే కదా! ఇలాంటి అద్భతం అమెరికాలో(America) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ ఆఫ్రికన్‌ అమెరికన్‌. అమెరికాలో బెన్‌డిక్ట్‌ ఇన్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ మేరి వ్యవస్థాపకురాలు. అంటే నన్స్‌ ఆశ్రమం అన్నమాట. అక్కడ ఆమె నన్‌గా(NUN) సమాజ సేవ చేశారు.

దురదృష్టవశాత్తూ ఆమె 2019లో కన్నుమూశారు. ఆమెను ఆ ఆశ్రమం సమీపంలోనే ఖననం చేశారు. ఇటీవల ఆమె సమాధి పాడవ్వడాన్ని గుర్తించారు ఆశ్రమంలోని కొందరు. ఆమె అవశేషాలను మరో చోటికి తరలించి కొత్తగా సమాధి కట్టించాలని నిర్ణయించుకున్నారు. అందు కోసం ఆమె శవపేటికను బయటకు తీశారు. అందులో ఆమె మృతదేహం చూసి ఆశ్చర్యపోయారు. శవం నుంచి కొంచెం కూడా దుర్వాసన రావడం లేదు సరికదా, మృతదేహం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఖననం(Funeral) చేసినప్పుడు ఎలా ఉందో అలా ఉందన్నమాట.

నిజానికి తాము ఎముకలు మాత్రమే ఉంటాయని అనుకున్నామని ఆమె సంబంధికులు తెలిపారు. ఆమె మృతదేహం పాడవ్వకుండా ఎలాంటి లేపనాలు పూయలేదని, సాధారణ మనిషిలాగే ఖననం చేశామన్నారు. పగిలిన శవపేటికలో ఓ తేలికపాటి మెత్తని పొరలాంటి బట్టతో మృతదేహాన్ని చుట్టామని చెబుతూ ఆమె శవం పాడవవ్వకుండా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా పాకడంతో ఆమె మృతదేహాన్ని చూడటానికి బెనెడిక్ట్‌ ఇన్‌ ఆశ్రమానికి జనం తండోపతండాలుగా వచ్చారు.

చిత్రమేమిటంటే ఆమె మెడకు చుట్టిన బట్ట, తలకు ధరించిన బట్ట మాత్రమే పాడవ్వడం. సంవత్సరాల తరబడి ఆమె మృతదేహం కొద్దిగా పాడైన శవ పేటికలో ఉంటూ, ఎండకు, వానకు ఎక్స్‌పోజ్‌ అవుతూ ఉన్నా ఏ మాత్రం కుళ్లిపోకుండా అలాగే ఉండటం చిత్రాతిచిత్రమంటున్నారు బంధువులు. ప్రస్తుతం విల్హెల్మినా లాంకాస్టర్ మృతదేహాన్ని మరో చోటికి తరలించి సమాధి చేస్తామని ఆమె తల్లి సిసిలియా తెలిపారు. జీసస్‌ పట్ల ఆమెకు ఉన్న భక్తి విశ్వాసాలకు, నిస్వార్థపూరిత సేవాగుణానికి ఆ దేవుడు ఇచ్చిన వరమే ఇది అని మృతురాలి తల్లి, బంధువులు అంటున్నారు.

Updated On 30 May 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story