దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్‌లో(Parliament) బుధవారం అలజడి రేగింది. లోక్‌సభ(Loksabha) లోపలికి ఆగంతకులు ప్రవేశించి గందరగోళం సృష్టించిచారు. సందర్శకుల గ్యాలరీ(Gallery) నుంచి ఒక్కసారిగా సభలోకి దూకి టియర్ గ్యాస్(Tear gas) విడిచారు. నిందితులు తమ బూట్లలో గ్యాస్ క్యానిస్టర్లను దాచుకుని తెచ్చారు. భద్రతా సిబ్బంది వీటిని గమనించలేదు కాబట్టే ఆ సమయంలో విధులలో ఉన్న ఎనిమిది మంది భద్రతా(Security) సిబ్బందిని సస్పెండ్ చేశారు.

Gas cansister
దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్‌లో(Parliament) బుధవారం అలజడి రేగింది. లోక్‌సభ(Loksabha) లోపలికి ఆగంతకులు ప్రవేశించి గందరగోళం సృష్టించిచారు. సందర్శకుల గ్యాలరీ(Gallery) నుంచి ఒక్కసారిగా సభలోకి దూకి టియర్ గ్యాస్(Tear gas) విడిచారు. నిందితులు తమ బూట్లలో గ్యాస్ క్యానిస్టర్లను దాచుకుని తెచ్చారు. భద్రతా సిబ్బంది వీటిని గమనించలేదు కాబట్టే ఆ సమయంలో విధులలో ఉన్న ఎనిమిది మంది భద్రతా(Security) సిబ్బందిని సస్పెండ్ చేశారు. గ్యాస్ క్యానిస్టర్లను(Gas canister) స్మోక్ బాంబులు(Smoke Bombs), పొగ డబ్బాలు అని కూడా అంటారు. వీటిని ఉపయోగించడం ఇల్లీగలలేమీ కాదు. ఫోటో షూట్‌లలో(Photo shoot), మిలటరీ విభాగాలలో ఉపయోగిస్తుంటారు. శత్రువుల కళ్లను పొగతో ఏమార్చడానికి గ్యాస్ క్యానిస్టర్లను ఉపయోగిస్తారు. మెగా క్రీడోత్సవాలలో(Sports event) కూడా పొగ డబ్బాలను వాడతారు. ఫుట్‌బాల్(Football) ఆటలో ఇలాంటివి చూడొచ్చు. తమ క్లబ్ రంగులను ప్రదర్శించడానికి ఫ్యాన్స్ వీటిని వాడతారు. ఇక మిలటరీ ఆపరేషన్‌లలో గ్రనైడ్లతో కూడిన క్యానిస్టర్లను ఉపయోగిస్తారు. దట్టమైన పొగను పుట్టించడం ద్వారా అవతలివారి కదలికలను మందకొడిగా మార్చవచ్చు. శత్రువుల కళ్లు కప్పి కీలక ఆపరేషన్లను(Opertions) చేయవచ్చు.
