Bride Gets Arrest In Kerala : తాళికట్టే టైమ్‌కు పోలీసుల ఎంట్రీ... పెళ్లి పీటల మీద నుంచి బలవంతంగా వధువులు లాక్కెళ్లారు..
సినిమాల్లో క్లయిమాక్స్ సీన్‌లోనే పోలీసులు ఎంటరవుతారు కదా! సరిగ్గా అలాగే వధువు మెడలో వరుడు తాళి కడుతున్న టైమ్‌కు పోలీసులు వచ్చారు. రావడం రావడంతోనే వధువును బలవంతంగా పెళ్లి పీటలపై నుంచి లాక్కెళ్లారు. అడ్డొచ్చిన వరుడిని నెట్టేశారు..అసలేం జరిగిందంటే కేరళలోని(Kerala) కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా(Alfia), అఖిల్(Akhil) ప్రేమించుకున్నారు.
సినిమాల్లో క్లయిమాక్స్ సీన్‌లోనే పోలీసులు ఎంటరవుతారు కదా! సరిగ్గా అలాగే వధువు మెడలో వరుడు తాళి కడుతున్న టైమ్‌కు పోలీసులు వచ్చారు. రావడం రావడంతోనే వధువును బలవంతంగా పెళ్లి పీటలపై నుంచి లాక్కెళ్లారు. అడ్డొచ్చిన వరుడిని నెట్టేశారు..అసలేం జరిగిందంటే కేరళలోని(Kerala) కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా(Alfia), అఖిల్(Akhil) ప్రేమించుకున్నారు. మతాలు(Religions) వేరు కావడంతో రెండు కుటుంబాల సభ్యులు పెళ్లికి ససేమిరా అన్నారు. దాంతో ఇంట్లోంచి వెళ్లిపోయారు.
ఆదివారం రోజున స్థానిక ఆలయంలో(Temple) పెళ్లి(Marriage) ఏర్పాట్లు చేసుకున్నారు. వధూవరులకు చెందిన మిత్రులంతా పెళ్లికి వచ్చారు. సరిగ్గా తాళి కట్టే టైమ్‌కు పోలీసులు ఆలయానికి వచ్చారు. అల్ఫియాను బలవంతంగా కోవలం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తనను వదిలేయమంటూ ఆమె ఎంతగా ప్రాధేయపడ్డా పోలీసులు కరగలేదు. బలవంతంగా ప్రైవేటు వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. వరుడు అఖిల్ ఆమె దగ్గరకు వెళుతుంటే పోలీసులు అతడిని అడ్డుకుని నెట్టేశారు.
వీటికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేరళ పోలీసుల ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అల్ఫియా కనిపించడం లేదన్న కంప్లయింట్ తమకు అందిందని, దానిపై తాము దర్యాప్తు చేపట్టామని, ఆమె పెళ్లి చేసుకుంటుందని తెలిసి అక్కడకు వెళ్లామని అలప్పుళ జిల్లా సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టామని అన్నారు. అయితే అల్ఫియా మేజర్ కావడంతో ఆమె ఇష్టానుసారం అఖిల్‌తో పంపించామని చెప్పారు.
ఈ సంఘటనపై అల్ఫియా, అఖిల్ కూడా మీడియాతో మాట్లాడారు. 'అఖిల్‌ను పెళ్లి చేసుకోవడం మా అమ్మానాన్నలకు ఇష్టం లేదు. వారు నన్న బలవంతంగా తీసుకెళ్లాలనుకున్నారు. అందుకే నేను కనిపించడం లేదని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నన్ను బలవంతంగా తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. నేను నా ఇష్టపూర్వకంగానే అఖిల్‌తో వెళ్లానని కోర్టుకు చెప్పాను. దీంతో మమ్మల్ని వారు వెళ్లనిచ్చారు' అని ఆల్ఫియా చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు తమతో అమానుషంగా, అసభ్యకరంగా ప్రవర్తించారని, బలవంతంగా అల్ఫియాను లాక్కెళ్లడమే కాకుండా తనను తోసేశారని అఖిల్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పోలీసుల కారణంగా ఆగిపోయిన పెళ్లి మంగళవారం జరగనుంది.