Brazilian woman: 56 ఏళ్ల పాటు కడుపులో పిండాన్ని మోసిన బ్రెజిల్ మహిళ!
సాధారణంగా గర్భిణులు నవమోసాలు బిడ్డను మోసి ప్రసవిస్తారు. పది నెలల తర్వాత కానుపు జరగడం అన్నది చాలా అరుదు. కానీ బ్రెజిల్‌కు చెందిన 81 ఏళ్ల ఓ మహిళ (Brazilian woman:) మాత్రం 56 ఏళ్లు చనిపోయిన పిండాన్న (fetus) కడుపులో మోసింది

brazil lady-compressed
సాధారణంగా గర్భిణులు నవమోసాలు బిడ్డను మోసి ప్రసవిస్తారు. పది నెలల తర్వాత కానుపు జరగడం అన్నది చాలా అరుదు. కానీ బ్రెజిల్‌కు చెందిన 81 ఏళ్ల ఓ మహిళ (Brazilian woman) మాత్రం 56 ఏళ్లు చనిపోయిన పిండాన్న (fetus) కడుపులో మోసింది. ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చిన ఆమెకు తన కడుపులో చనిపోయిన పిండం ఉందన్న సంగతే తెలియకపోవడం గమనార్హం. డాక్టర్లు శస్త్రచికిత్స చేసి మృత పిండాన్ని తొలగించారు. ఆ మరుసటి రోజునే ఆ వృద్ధ మహిళ మరణించడం విషాదం. డానియెలా వెరా (Daniela Vera) అనే మహిళ కొన్ని వారాలుగా కడుపునొప్పితో బాధపడుతూ డాక్టర్ల దగ్గరకు వెళ్లింది. డాక్టర్లకు ఇన్‌ఫెక్షన్ అయ్యిందేమోనని అనుకున్నారు. దానికి మందులిచ్చి ఆమెను పంపించేశారు. మందులు వాడినా నొప్పి తగ్గకపోవడంతో మళ్లీ వైద్యులను సంప్రదించింది. అప్పుడు డాక్టర్లకు అనుమానం వచ్చి త్రీ డీ స్కానింగ్ చేశారు. ఆమె కడుపులో చనిపోయిన పిండం ఉందని గుర్తించి షాకయ్యారు. వెంటనే సర్జరీ చేసి పిండాన్ని తొలగించారు. ఆ మరుసటి రోజునే ఆమె చనిపోయారు.
