పునరపి జననం.. పునరపి మరణం.. పునరపి జననీ జఠరే శయన అని అన్నాడు ఆది శంకరాచార్యులు(shankaracharya). ఆత్మకు అంతం లేదంటుంది భగవద్దీత(Bhagavadita). మనిషి బుద్ది ఎరిగినప్పట్నుంచే పునర్జన్మ ఉంటుందా అన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. చనిపోయిన వ్యక్తులు మళ్లీ పుడతారంటారు కొందరు. ఇది అసాధ్యమని అంటారు మరికొందరు. కానీ అప్పుడప్పుడు జరుగుతున్న సంఘటనలు పునర్జన్మపై(Reincarnation) నమ్మకాలను పెంచుతున్నాయి.

పునరపి జననం.. పునరపి మరణం.. పునరపి జననీ జఠరే శయన అని అన్నాడు ఆది శంకరాచార్యులు(shankaracharya). ఆత్మకు అంతం లేదంటుంది భగవద్దీత(Bhagavadita). మనిషి బుద్ది ఎరిగినప్పట్నుంచే పునర్జన్మ ఉంటుందా అన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. చనిపోయిన వ్యక్తులు మళ్లీ పుడతారంటారు కొందరు. ఇది అసాధ్యమని అంటారు మరికొందరు. కానీ అప్పుడప్పుడు జరుగుతున్న సంఘటనలు పునర్జన్మపై(Reincarnation) నమ్మకాలను పెంచుతున్నాయి. తమ పూర్వ జన్మ ఇదేనంటూ కొందరు పూసగుచ్చినట్టు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కూడా! ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో(uttarpradesh) చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పూర్‌(Mainpur) జిల్లాలో ఎలావూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మంగల్‌పూర్‌ గ్రామంలో పునర్జన్మకు సంబంధించిన ఓ సంఘటన చాలా మందిని ఆ దిశగా చూసేలా చేస్తున్నది.

ఎనిమిదేళ్ల పిల్లోడు తన అమ్మమ్మను(Grand Mother) తన భార్య అని చెబుతున్నాడు. ఈ మాట మొదటిసారి ఆ బాలుడి నోటి వెంట వచ్చినప్పుడు కుటుంబసభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ పదే పదే ఆ మాటే చెబుతూ గతంలో జరిగిన కొన్ని సంఘటనలు వివరిస్తుండటంతో కుటుంబసభ్యులు నమ్మక తప్పలేదు. మొన్న జూన్‌ 15వ తేదీన ఎనిమిదేళ్ల ఆర్యన్‌(Aryan) తన తల్లితో పాటు అమ్మమ్మ ఊరు అయిన రతన్‌పూర్‌కు(Rathanpur) వచ్చాడు. 'వెళ్లి అమ్మమ్మ కాళ్లకు దండం పెట్టు' అని ఆర్యన్‌తో అతడి తల్లి చెప్పింది. అమ్మమ్మ దగ్గరకు వెళ్లిన ఆర్యన్‌ 'ఈమె నా అమ్మమ్మ కాదు, నా భార్య' అని గట్టిగా అన్నాడు. అక్కడే ఉన్న మేనమామను తన కొడుకని చెప్పాడు. ఆర్యన్‌ మాటలను మొదట కుటుంబ సభ్యులు లైట్‌ తీసుకున్నారు.

అయితే ఆర్యన్‌ అదే విషయాన్ని మళ్లీ మళ్లీ అంటుండటంతో వారికి అనుమానం వచ్చింది. గతంలో వారి కుటుంబంలో జరిగిన అన్ని సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పసాగాడు. ఇవి తన పూర్వజన్మకు సంబంధించిన విషయాలని తెలిపాడు. గత జన్మలో తన పేరు మనోజ్‌ మిశ్రా అని, ఎనిమిదేళ్ల కిందట అంటే 2015, జనవరి 9వ తేదీన పొలంలో పని చేస్తున్నప్పుడు పాము కాటుతో మరణించానని చెప్పాడు. పొలంలో తనకు ఓ రంధ్రం కనిపించిందని, దాన్ని కాలితో మూసివేస్తున్నప్పుడు పాము కరిచిందని, వెంటనే తాను స్పృహ కోల్పోయానని, ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయానని చెప్పాడు. ఆ బాలుడి నోటి వెంట వచ్చిన ఈ మాటలు విని అక్కడున్నవారు భయంతో ఉలిక్కిపడ్డారు.

ఎందుకంటే ఆ కుర్రాడు చెప్పిన మాటలన్నీ వాస్తవం కావడం. నిజంగానే ఆ కుర్రాడు గత జన్మలో మనోజ్‌ మిశ్రానేనని(Manoj Mishra) బలంగా నమ్మారు. తాను చనిపోయిన సమయంలో తన కూతురు, (అంటే ఆర్యన్‌ తల్లి) గర్భవతి అని, తన దశదిన కర్మలు ముగిసిన వెంటనే తన కూతురు రంజన చక్కటి కుమారుడిని జన్మనిచ్చిందని ఆర్యన్‌ చెప్పుకొచ్చాడు. ఎనిమిదేళ్ల బాలుడు ఇవన్నీ చెబుతుండటం అక్కడివారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆర్యన్‌ది కచ్చితంగా పునర్జన్మేనని వారు ఊరందరికీ చెప్పారు. తన అమ్మమ్మ నీరజ్‌ మిశ్రాను తన భార్యగా, మేనమామలైన అనుజ్‌(Anuj), అజయ్‌లను(Ajay) తన కొడుకులుగా, తన తల్లి రంజనను తన కూతురుగా ఆర్యన్‌ చెప్పసాగాడు. వాస్తవానికి నాలుగేళ్ల వయసు నుంచే ఆర్యన్‌ గత జన్మ విషయాలను చెబుతున్నాడని, అయితే తాము దీనికి సీరియస్‌గా తీసుకోలేదని, ఇప్పుడు నమ్మకం తప్పడం లేదని ఆర్యన్‌ మేనమామ అజయ్‌ అంటున్నాడు. ఆర్యన్‌ అమ్మమ్మ నీరజ్‌ మిశ్రా కూడా ఆ బాలుడి మాటలు నిజమేనని నమ్ముతోంది..

Updated On 17 Jun 2023 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story