చాలా మంది ఆఫీసునెలా ఎగ్గొట్టాలా అని ఆలోచిస్తుంటారు. సందు దొరికితే చాలు సెలవు పెట్టేసి ఎంజాయ్‌ చేస్తారు. సెలవులు ఉన్నవే తీసుకోడానికే కదా అని అంటుంటారు. తమ ఎంటైర్‌ ఉద్యోగ జీవితంలో సెలవు పెట్టకుండా పదవీ విరమణ చేసిన వారు కూడా కొందరుంటారు. అలాంటి వారిలో మెల్బా మెబానే(Melba Mebane) అనే బామ్మగారు కూడా ఉన్నారు. అమెరికా(America)లోని టెక్సాక్‌కు చెందిన 90 ఏళ్ల మెల్బా మెబానే 16 ఏళ్ల వయసున్నప్పుడు ఓ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో చేరారు.

చాలా మంది ఆఫీసునెలా ఎగ్గొట్టాలా అని ఆలోచిస్తుంటారు. సందు దొరికితే చాలు సెలవు పెట్టేసి ఎంజాయ్‌ చేస్తారు. సెలవులు ఉన్నవే తీసుకోడానికే కదా అని అంటుంటారు. తమ ఎంటైర్‌ ఉద్యోగ జీవితంలో సెలవు పెట్టకుండా పదవీ విరమణ చేసిన వారు కూడా కొందరుంటారు. అలాంటి వారిలో మెల్బా మెబానే(Melba Mebane) అనే బామ్మగారు కూడా ఉన్నారు. అమెరికా(America)లోని టెక్సాక్‌కు చెందిన 90 ఏళ్ల మెల్బా మెబానే 16 ఏళ్ల వయసున్నప్పుడు ఓ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో చేరారు. అప్పట్నుంచి పదవీ విరమణ చేసే వరకూ సెలవు అనే మాట లేకుండానే విధులకు హాజరయ్యారు. 1949లో టైలర్‌ అనే స్టోర్‌లో మెబానే ఉద్యోగంలో చేరారు. 1956లో ఆ స్టోర్‌ను డిలార్డ్‌ కొనుగోలు చేసింది. మొదట లిఫ్ట్‌ ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరిన ఆమె 74 ఏళ్ల పాటు అదే సంస్థలో కొనసాగారు. ఆ షాపింగ్‌ మాల్‌లో దుస్తులు, కాస్మొటిక్‌ విభాగంలోనే ఆమె సుదీర్ఘకాలం పని చేశారు. ఇలా ఏడు దశాబ్దాల పాటు సెలవు లేకుండా డ్యూటీ చేశారు. 'మెబానే విధి నిర్వహణలో ఉన్నకాలంలో ఎంత మందికి ట్రైనింగ్‌ ఇచ్చారో లెక్కే లేదు. ఆమె కేవలం సెల్స్‌ ఉమెనే కాదు, ఓ మాతృమూర్తి. ఎంతో మందికి స్ఫూర్తి. కేవలం పనిలోనే కాదు, జీవితంలోనూ ఆమె ఎన్నో సూచనలు చేశారు. సలహాలు ఇచ్చారు. ఆమె పని చేసిన ప్రతి విభాగంలోనూ ఆమె ముద్ర ఉంది. నిజంగా ఆమె వండర్‌ ఉమెన్‌' అని డిలార్డ్‌ స్టోర్‌ మేనేజర్‌ తెలిపారు. ఆమెను దాదాపుగా 65 ఏళ్ల నుంచి చూస్తున్నానని చెప్పారు. ఆ స్టోర్‌లో ఉన్నవారంటేతనకు ఎంతో ప్రేమ అని, రోజూ విధులకు హాజరుకావడం అంటే తనకు చాలా ఇష్టమని మెబానే తెలిపారు. ఇక నుంచి మంచి ఆహారం తీసుకుంటూ, ప్రయాణాలు చేస్తూ హాయిగా విశ్రాంతి తీసుకుంటానని అన్నారు.

Updated On 7 July 2023 2:02 AM GMT
Ehatv

Ehatv

Next Story