ఓ రెండు మూడురోజులు తిండిలేకపోయినా బతకగలం కానీ, నిద్రలేకపోతే కష్టం. మరి 60 ఏళ్లకుపైబడి నిద్రకు దూరంగా ఓ వ్యక్తి ఉన్నాడంటే నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది కట్టుకథ కాదు. వియత్నాంకు చెందిన థాయ్‌ అంజోక్‌ అనే ఈ పెద్దమనిషి 62 ఏళ్లుగా నిమిషం పాటు కూడా నిద్రపోలేదట!

ఓ రెండు మూడురోజులు తిండిలేకపోయినా బతకగలం కానీ, నిద్రలేకపోతే కష్టం. మరి 60 ఏళ్లకుపైబడి నిద్రకు దూరంగా ఓ వ్యక్తి ఉన్నాడంటే నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది కట్టుకథ కాదు. వియత్నాంకు చెందిన థాయ్‌ అంజోక్‌ అనే ఈ పెద్దమనిషి 62 ఏళ్లుగా నిమిషం పాటు కూడా నిద్రపోలేదట! 1962 నుంచి ఆయన నిద్రకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. థాయ్‌ అంజోక్‌ నిద్రపోవడాన్ని ఆయన భార్యాపిల్లలు అసలు చూడలేదట! ప్రస్తుతం థాయ్‌ అంజోక్‌ వయసు 80 ఏళ్ల పైనే ఉంటాయి. 1962లో ఓ రోజు రాత్రి ఆయనకు విపరీతమైన జ్వరం వచ్చిందట! అప్పట్నుంచి ఎంత ప్రయత్నించినా ఆయనకు నిద్ర రావడం లేదట!హాయిగా నిద్రపోవాలని ఉన్నా అది కుదరడం లేదని వాపోతున్నాడు. డాక్టర్లు ఇది నిద్రలేమి అని చెబుతున్నారు. ఎక్కవ రోజులు నిద్రపోకపోతే శారీరక, మానసిక ఆరోగ్యంపై అది తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. కానీ థాయ్‌ అంజోక్‌ మాత్రం ఇప్పటికీ సలక్షణంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం బ్రహ్మండంగా ఉండటం చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ వయసులోనూ పొలం పనులు చేసుకుంటూ సుఖంగా ఉన్నాడు. గ్రీన్‌ టీ, రైస్‌ వైన్‌ అంటే థాయ్‌ అంజోక్‌కు ఇష్టమట! నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా అది మాత్రం రావడం లేదని థాయ్‌ బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఓ దేశీ మద్యం తయారీ కంపెనీలో పని చేస్తున్నాడు థాయ్‌. రాత్రి మూడు గంటల వరకు డ్యూటీ చేస్తాడు. అసలు థాయ్‌కు ఎందుకు నిద్రపట్టడం లేదో వైద్య శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. పరీక్షలు అన్ని చేసి చూశారు కానీ విరుగుడు కనిపెట్టలేకపోతున్నారు. పాపం థాయ్‌ ఇంకెన్ని రోజులు నిద్రలేకుండా ఉండాల్సి వస్తుందో!

Updated On 23 Jan 2024 1:59 AM GMT
Ehatv

Ehatv

Next Story