అంత్యక్రియలు చేసిన మర్నాడే సదరు వ్యక్తి ప్రాణాలతో తిరిగి వస్తే..! భయంతో కూడిన ఆందోళన వల్ల కంగారు పుట్టడం ఖాయం ! తమిళనాడులోని(TamilNadu) తిరువళ్లూరు జిల్లాలో సేలైకండ్రిక గ్రామంలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఆ గ్రామానికి చెందిన 56 ఏళ్ల సొక్కమ్మాల్‌కు(Sokkamal) ముగ్గురు కుమారులు. ప్రస్తుతం అదే ఊర్లో చిన్న కుమారుడు శరవణన్‌ దగ్గర ఉంటోంది.

అంత్యక్రియలు చేసిన మర్నాడే సదరు వ్యక్తి ప్రాణాలతో తిరిగి వస్తే..! భయంతో కూడిన ఆందోళన వల్ల కంగారు పుట్టడం ఖాయం ! తమిళనాడులోని(TamilNadu) తిరువళ్లూరు(Tiruvallur) జిల్లాలో సేలైకండ్రిక గ్రామంలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఆ గ్రామానికి చెందిన 56 ఏళ్ల సొక్కమ్మాల్‌కు(Sokkamal) ముగ్గురు కుమారులు. ప్రస్తుతం అదే ఊర్లో చిన్న కుమారుడు శరవణన్‌ దగ్గర ఉంటోంది. వారం కిందట సొక్కమ్మాల్‌కు, ఎదురింట్లో ఉన్న ఓ మహిళకు గొడవ జరిగింది. ఈ గొడవలో సొక్కమ్మాల్‌ చిన్నపాటి గాయాలయ్యాయి. దాంతో అలిగిన ఆమె చెప్పాపెట్టకుండా చెన్నైలో ఉంటున్న పెద్ద కొడుకు గాంధీ దగ్గరకు వెళ్లిపోయింది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఆమె పచ్చరంగు చీర, ఎరుపురంగు జాకెట్‌ను వేసుకున్నారు. బుధవారం తిరువళ్లూరు జిల్లా పుట్లూరు రైల్వేట్రాక్‌పై అవే రంగు దుస్తులతో ఉన్న వృద్ధురాలి మృతదేహం గుర్తు తెలియని విధంగా కనిపించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ వార్త పలు దిన పత్రికలలో రావడంతో చనిపోయింది తన తల్లి సొక్కమ్మాలేనని అనుకున్నాడు చిన్నకుమారుడు శరవణన్‌(Shravan).

రైల్వే పోలీసుల దగ్గరకు వెళ్లి విషయం చెప్పి మృతదేహాన్ని తీసుకొచ్చాడు. బంధు మిత్రులకు సమాచారం ఇచ్చారు. చెన్నైలో ఉంటున్న పెద్దన్న గాంధీకి చెప్పే ప్రయత్నం చేశాడు కానీ గాంధీకి, శరవణన్‌కు మధ్య మాటలు లేకపోవడంతో గాంధీ ఫోన్‌ ఎత్తలేదు. ఎన్నిసార్లు చేసినా గాంధీ ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. మే 28వ తేదీన అంటే ఆదివారం రోజున అంత్యక్రియలు నిర్వహించారు. సొక్కమ్మాల్‌ సోమవారం ఉదయం శరవణన్‌ ఇంటికి వచ్చింది. కొడుకు బిత్తరపోయాడు. సొక్కమ్మాల్‌ ప్రాణంతో తిరిగి వచ్చారన్న విషయం గ్రామమంతా తెలిసిపోయింది. శరవణన్‌ ఇంటి ముందు జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో రైల్వే పోలీసులకు శరవణన్‌ విషయమంతా చెప్పాడు. చనిపోయిన మహిళను తన తల్లిగా భావించి అంత్యక్రియలు నిర్వహించామని, అయితే తన తల్లి ప్రాణాలతో ఇంటికి వచ్చిందని పోలీసులకు వివరించాడు. దీంతో రైల్వే పోలీసులు మళ్లీ విచారణ చేపట్టారు. విచారణలో చనిపోయిన మహిళ సొక్కమ్మాల్‌ కాదని నిర్ధారించారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు మంగళవారం డిప్యూటీ తహసీల్దార్‌ అంబిక, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ గణేషన్‌ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీశారు. డీఎన్‌ఏ టెస్టు కోసం నమూనాలను సేకరించారు. విచారణలో మృతి చెందిన మహిళ రెడ్‌హిల్స్‌కు చెందిన ఏలుమలై భార్య శకుంతలమ్మాల్‌గా గుర్తించారు.

Updated On 1 Jun 2023 3:05 AM GMT
Ehatv

Ehatv

Next Story