Road way Under Sea : సముద్రం అట్టడుగున 7 వేల ఏళ్ల నాటి రహదారి
సముద్రపు(sea) అట్టడుగున ఓ అద్భతమైన రహదారి. రాతిపలకలతో నిర్మించిన ఆ రహదారి ఇప్పటిది కాదు, ఏడువేల ఏళ్ల కిందటిది. సంభ్రమాశ్చర్యాలను కలిగించే ఆ పురాతన రహదారిని మధ్యదరా సముద్రంలో కనుగొన్నారు. పురావస్తు పరిశోధనల్లో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. నాలుగు మీటర్ల(4 Meters) వెడల్పు ఉన్న ఈ రహదారికి వాడిన చెక్కను రేడియో కార్బన్ అనాలిసిస్ ద్వారా పరిశీలిస్తే అద్భుతమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సముద్రపు(sea) అట్టడుగున ఓ అద్భతమైన రహదారి. రాతిపలకలతో నిర్మించిన ఆ రహదారి ఇప్పటిది కాదు, ఏడువేల ఏళ్ల కిందటిది. సంభ్రమాశ్చర్యాలను కలిగించే ఆ పురాతన రహదారిని మధ్యదరా సముద్రంలో కనుగొన్నారు. పురావస్తు పరిశోధనల్లో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. నాలుగు మీటర్ల(4 Meters) వెడల్పు ఉన్న ఈ రహదారికి వాడిన చెక్కను రేడియో కార్బన్ అనాలిసిస్ ద్వారా పరిశీలిస్తే అద్భుతమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడు వేల సంవత్సరాల కిందట ఈ రహదారిపై ప్రజలు నడిచేవారని తేలింది. ఆ కాలంలో విరాజిల్లిన హ్వార్ నాగరికత ప్రజలు నిర్మించిన రహదారి ఇది. కోర్కులా ద్వీపంలోని వెలాలుక సమీపంలో గ్రాండినా బే దగ్గర జరిపిన భూ పరిశోధనలో భాగంగా సముద్రపు అట్టడుగున ఈ రహదారిని కనుగొన్నారు. ఇక్కడే ఆ కాలం నాటి చెకుముకి బ్లేడ్‌లు, రాతి గొడ్డళ్లు కూడా బయటపడ్డాయి. తవ్వకాలు జరిపితే మరిన్ని అద్భుతాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.