Smart phone Blast : జేబులో ఉన్న మొబైల్ ఫోన్ హఠాత్తుగా ఢాం అంటూ పేలింది...
మొబైల్ ఫోన్లు(Mobile phone) బాంబు పేలినట్టే పేలుతున్నాయి. కేరళలో(Kerala) అయితే ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో వేర్వేరు చోట్ల మూడు ఘటనలు జరిగాయి. త్రిస్సూర్‌లో 70 ఏళ్ల వృద్ధుడి షర్ట్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ హఠాత్తుగా పేలిపోయింది. ఇలియాస్ అనే ఆ వృద్ధుడు టీ షాపులో టీ తాగుతూ రిలాక్సవుతున్నాడు.
మొబైల్ ఫోన్లు(Mobile phone) బాంబు పేలినట్టే పేలుతున్నాయి. కేరళలో(Kerala) అయితే ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో వేర్వేరు చోట్ల మూడు ఘటనలు జరిగాయి. త్రిస్సూర్‌లో 70 ఏళ్ల వృద్ధుడి షర్ట్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ హఠాత్తుగా పేలిపోయింది. ఇలియాస్ అనే ఆ వృద్ధుడు టీ షాపులో టీ తాగుతూ రిలాక్సవుతున్నాడు. అంతులోనే మొబైల్ ఫోన్ పేలింది. మంటలు వ్యాపించాయి. షర్ట్ కూడ అంటుకుంది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. తృటిలో ఇలియాస్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఏడాది కిందట వెయ్యి రూపాయలు పెట్టి ఈ ఫోన్‌ను కొన్నానని, ఇది ఫీచర్ ఫోన్ అని పోలీసులతో ఇలియాస్ చెప్పుకుని ఆవేదన చెందాడు. ఇప్పటి వరకు ఫోన్‌తో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదని చెప్పాడు.
లాస్ట్‌వీక్ కోజికోడ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి ప్యాంటు జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్(Smart phone) ఉన్నట్టుండి హఠాత్తుగా పేలింది. లేచిన వేళావిశేషం మంచిది కాబట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఫోన్ వేడెక్కడంతోనే బ్యాటరీ పేలిపోయిందని నిపుణులు చెప్ఆరు. అలాగే త్రిస్సూర్ లో ఎనిమిదేళ్ల బాలిక చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఆకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో ఆ బాలిక ప్రాణాలు వదిలింది. ఈ ఘటనను మర్చిపోకముందే ఇప్పుడు అలాంటి ఘటనే జరగడంతో జనం కలవరపడుతున్నారు. మొబైల్‌ఫోన్‌ను చూసి జడుసుకుంటున్నారు.