హిందూ సాంప్రదాయంలో వివాహ(Marriage) వ్యవస్థపై అత్యంత విశ్వాసం ఉంది. వివాహంలో రాశులు(Zodiac) ముఖ్యభూమిక పోషిస్తాయి. పుట్టిన నక్షత్రం (Birth star) ఆధారంగా రాశులను నిర్ణయిస్తారు. ఈ కాలంలో నక్షత్రాలు, రాశులు, జాతకాలు(Astrology) అన్నీ కుదిరాకే వివాహాలను నిశ్చయించుకుంటున్న విషయం తెల్సిందే. పెళ్లిళ్లు పైలోకంలోనే రాసిపెట్టి ఉంటాయని.. అక్కడ రాసి ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా పెళ్లిళ్లు ఆగవని పండితులు(Pandits) అంటుంటారు. కొన్ని రాశులవారికి వివాహ యోగ్యంలో ఇమడలేకపోతారని.. వారు పెళ్లి కన్నా డేటింగ్‌కే(Dating) మొగ్గుచూపుతారని చెప్తున్నారు. ఒకప్పుడు డేటింగ్‌ అంటే తప్పులా భావించేవారు. కాలక్రమేణ డేటింగ్‌ కల్చర్‌కు(Culture) జనం అలవాటు పడుతున్నారు. మరి డేటింగ్‌కే ఇంపార్టెన్స్‌ ఇస్తున్న ఐదురాశులు ఏంటో చూద్దామా మరి..?

డేటింగే ఇష్టమంటున్న ఆ 5 రాశులవారు..!

మేష రాశి (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
మేష రాశి(Aries) రాశివారు సుదీర్ఘకాలం సంబందాలు పెట్టుకోరట. వివాహం చేసుకున్నా అందులో కుదురుకోరని చెప్తున్నారు. కుటుంబ వ్యవస్థ (Family life), బంధాలు (Bonding), బంధుత్వాల కన్నా ఏకంతంగా ఉండేందుకే ఇష్టపడతారని చెప్తున్నారు. షార్ట్‌ రిలేషన్‌ (Short Relation) బెటర్‌ అంటారట. ఒకరిపై ఒకరికి ప్రేమ శాశ్వతం కాదని ఈ రాశివారు భావిస్తారని పండితులు చెప్తున్నారు.

మిథున రాశి (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

మిథున రాశి(Gemini) రాశివారు మైండ్‌(Mind) ఏం చేప్తే బ్లైండ్‌గా(Blind) వెళ్లిపోతారట. ఎవరు చెప్పినా వినరు.. తన మాటే శాసనం అనుకుంటారట. ఒకే బంధంలో కొనసాగడం వీరికి అసలే ఇష్టం ఉండదని చెప్తున్నారు. సమయాన్ని బట్టి వీరి రుచులు(Tastes), అభిరుచులు మారుతాయని అంటున్నారు. ఎలాంటి సమస్యలు లేని రొమాంటిక్‌ లైఫ్‌ను(Romantic Life) ఇష్టపడతారని అంటున్నారు.

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

సింహరాశివారు(Leo) డామినేటింగ్‌గా(Dominating) ఉంటారట. తమ పార్ట్‌నర్లపై(Partner) ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటారట. వీరిపై ఎవరైనా పెత్తనం చెలాయించాలని చూస్తే అగ్గిమీద గుగ్గిలం అవుతారని అంటున్నారు. తమకిష్టమైనవారిపై అంతులేని ఆప్యాయత(Affection) ఒలకబోస్తారు కానీ వీరు కూడా షార్ట్‌ రిలేషన్స్‌కే మొగ్గుచూపుతారంటున్నారు. డేటింగ్‌పై స్పెషల్‌ ఫోకస్‌(Special Focus) ఈ రాశివారికి ఉంటుందని చెప్తున్నారు.

ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ధనుస్సు రాశి(Sagittarius) రాశివారు బంధంలో బందీ అయి ఉండలేమంటున్నారు. నచ్చిన పనిచేయడం కోసం ఎలాంటి నిర్ణయాలైనా(Decisions) తీసుకుంటారని అంటున్నారు. ధనుస్సు రాశి వారు ఒకరికి నచ్చినట్లు ఉండలేరని.. గతిలేక పెళ్లి బంధంలో(Marriage life) ఇరుక్కుంటారంటున్నారు. కానీ వీరికి స్వేచ్ఛగా జీవించాలన్న కోరికే అధికంగా ఉంటుందని అంటున్నారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కుంభ రాశి(Aquarius) రాశివారు బాధ్యతలను(Responsibilities) విస్మరించరు కానీ కుటుంబం, వివాహ బంధాల్లో ఇరుక్కుపోవడం ఇష్టం ఉండదట. బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూనే తమ అభీష్టం మేరకు అడుగులు వేస్తారట. రొటీన్‌ లైఫ్‌(Routine Life) నుంచి ఎప్పుడు విముక్తి చెందుతామా అని చూస్తారు. ప్రేమలు, బంధాల విషయాల్లో వీరి ఇష్టాఇష్టాలే వేరుగా ఉంటాయంటున్నారు జ్యోతిష్య(Astrologers) పండితులు.

Updated On 24 Nov 2023 4:55 AM GMT
Ehatv

Ehatv

Next Story