ఇన్‌స్టాగ్రామ్(instagram) ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడూ అద్భుతమైన అప్‌డేట్‌లను ఇస్తోంది ఇన్ స్టా. అలాగే కొత్త ఫీచర్లను పరిచయం చేయడం, రీల్స్(Reels), గ్రాఫిక్స్(graphics).. ఇలా ప్రతి ఒక్కరిని ప్రజలను అడిక్ట్ చేస్తుంది. రీల్స్ చేయడమే కాకుండా.. తమ ఫోటోలను అందంగా మార్చుకోవడానికి.. వీడియోస్ చేయడానికి అవసరమైన అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్(instagram) ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడూ అద్భుతమైన అప్‌డేట్‌లను ఇస్తోంది ఇన్ స్టా. అలాగే కొత్త ఫీచర్లను పరిచయం చేయడం, రీల్స్(Reels), గ్రాఫిక్స్(graphics).. ఇలా ప్రతి ఒక్కరిని ప్రజలను అడిక్ట్ చేస్తుంది. రీల్స్ చేయడమే కాకుండా.. తమ ఫోటోలను అందంగా మార్చుకోవడానికి.. వీడియోస్ చేయడానికి అవసరమైన అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. అయితే ఇన్ స్టా రీల్స్ డౌన్ లోడ్ చేసుకోవడం మాత్రం చాలా కష్టం. అందుకోసం మరో యాప్ ఇన్ స్టాల్ చేయడం.. లేదా క్రోమ్ ఉపయోగించడం జరుగుతుంది. కానీ వినియోగదారులు ఇప్పుడు ఇతరులు పోస్ట్ చేసిన రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మెటా ప్లాట్‌ఫారమ్‌ల యాజమాన్యంలోని ఫోటో, వీడియో షేరింగ్ సోషల్ నెట్‌వర్క్ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు.

కొత్త ఫీచర్ ఏంటీ అంటే..
1.) యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న వారు మాత్రమే తమ కెమెరా రోల్‌కి పబ్లిక్ రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలుగుతారని తెలిపింది ఇన్ స్టా. అందుకోసం వారు 'షేర్' ఐకాన్‌పై క్లిక్ చేసి.. ఆపై 'డౌన్‌లోడ్' బటన్‌ను సెలక్ట్ చేస్తే వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మోస్సేరి చెప్పారు.

2.) అలాగే పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా పోస్ట్ చేయబడిన రీల్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. .

3) అలాగే వినియోగదారులు రీల్స్‌ను డౌన్‌లోడ్ చేయడానికి స్విచ్ ఆఫ్ బటన్‌లను ఉపయోగించడానికి కూడా ఛాన్స్ ఉంది.

4) డౌన్‌లోడ్ చేసిన రీల్స్‌కు వాటర్‌మార్క్‌లు ఉంటే వాటిని డౌన్‌లోడ్ చేయడం ఎలా? అనేది చాలా మంది నుంచి ఎదురైన ప్రశ్న. కానీ మోస్సేరి ఈ విషయానికి ఎలాంటి క్లారిటీ తెలియజేయలేదు. తాను పోస్ట్ చేసిన ఫోటో వీడియోలో 'ఇన్‌స్టాగ్రామ్' లోగో, హ్యాండిల్ పేరు ఉంటుందని తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అంటే ఏమిటి?
ఆగస్ట్ 5, 2020న ఇన్ స్టా లో రీల్స్ పరిచయం చేశారు. రీల్స్ అనేది మెటా యాజమాన్య ప్లాట్‌ఫారమ్‌లో చిన్న వినోదాత్మక వీడియోలను సృష్టించడానికి,కనుగొనడానికి ఒక మార్గం. ఇది వ్యక్తులు రూపొందించిన వీడియోలు , ఆడియోలను మరింత ముఖ్యమైనదిగా చేస్తుంది. ఇందులో కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఎక్కువ మంది అనుచరులను పొందడానికి ఇది 15-సెకన్ల బహుళ-క్లిప్ వీడియోలను రికార్డ్ చేయగలదు. అలాగే దీని ద్వారా ఎక్కువ మందిని చేరుకోవచ్చు.

Updated On 23 Jun 2023 7:40 AM GMT
Ehatv

Ehatv

Next Story