అమెరికాలోని(America) టెన్నెసీలో అద్భుతం జరిగింది. టోర్నడో(Tornodo) బీభత్సానికి కొట్టుకుపోయిన నాలుగు నెలల(New Born) పసికూన.. బతికి బయటపడ్డాడు. మృత్యుంజయుడిగా అవతారమెత్తాడు. వివరాల్లోకి వెళ్తే.. గత వారం అమెరికాలోని టెన్నెసీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. సుడిగాలుల ధాటికి కొట్టుకుపోయిన 4 నెలల ఓ బాలుడు దగ్గరలోని చెట్టుపై ఇరుక్కొని ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు.
అమెరికాలోని(America) టెన్నెసీలో అద్భుతం జరిగింది. టోర్నడో(Tornado) బీభత్సానికి కొట్టుకుపోయిన నాలుగు నెలల(New Born) పసికూన.. బతికి బయటపడ్డాడు. మృత్యుంజయుడిగా అవతారమెత్తాడు. వివరాల్లోకి వెళ్తే.. గత వారం అమెరికాలోని టెన్నెసీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. సుడిగాలుల ధాటికి కొట్టుకుపోయిన 4 నెలల ఓ బాలుడు దగ్గరలోని చెట్టుపై ఇరుక్కొని ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. దీనిపై అతడి తల్లి సిడ్నీ(sydney) మూరే మాట్లాడుతూ టోర్నడో బీభత్సానికి మా ఇల్లు కొట్టుకుపోయిందని.. తమ బాబు, తమ ప్రాణాలను రక్షించుకునేందుకు తాము చేయని ప్రయత్నం లేదన్నారు. సుడిగాలి వస్తున్నప్పుడు ఒకరినొకరు పట్టుకొని.. ప్రాణాలు నిలుపుకునేందుకు ప్రయత్నించామని.. ఈ క్రమంలో తమ ఇల్లు కొట్టుకుపోయిందని.. తమతో పాటు ఉన్న 4 నెలల బాబు కూడా గాలికి ఎగిరిపోయాడని తెలిపింది. బాలుడి కోసం తల్లిదండ్రులు వెతికీవెతికి అలసిపోయారు. చివరగా ఓ చెట్టుపై ఉన్న బాలుడిని చూసి అతడిని రక్షించారు. బాలుడు ప్రాణాలతో ఉండడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా సుడిగాలి బీభత్సానికి ముగ్గురు వ్యక్తులు మరణించారని.. 25 మందికిపైగా గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.