తెలంగాణ (Telangana)లో ఎల్లుండి జరగనున్న అసెంబ్లీ (Assembly) సాధారణ ఎన్నికలకు ఈసీ సర్వం సిద్ధం చేసింది. నేటి సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో ఈసీ (EC) ఏర్పాట్లపై పూర్తి ఫోకస్ పెట్టింది. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా, 3 కోట్లకుపైగానే ఓటర్లు ఉన్నారు. ఓటర్ల సంఖ్య సరిపోయే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 35, 356 పోలింగ్ కేంద్రాలు (Polling Centers) ఏర్పాటు చేసినట్టు ఈసీ తెలిపింది. అలాగే ఓటింగ్ కోసం 36వేల ఈవీఎంల(EVM)ను సిద్ధం చేసింది. ప్రతి కౌంటింగ్ సెంటర్‎కు ఒక పరిశీలకుడు ఉంటారు. అలాగే రాష్ట్రస్థాయిలో ముగ్గురు అబ్జర్వర్లను ఎన్నికల కమిషన్ నియమించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ కార్డులు (Voter Cards), ఓటర్ స్లిప్పు (Voter Slips)లు పంపిణీ పూర్తి చేశారు. ఇప్పటికే కొత్తగా 51లక్షల ఓటర్ కార్డులు ప్రింట్ చేసి పోస్టల్‎శాఖ (Postal Department) ద్వారా ఓటర్ల చిరునామాకు పంపించారు. అలాగే.. 86 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేశారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్లు, టెండర్, ఛాలెంజ్ ఓట్ల కోసం బ్యాలెట్లు కలిపి మొత్తం 14 లక్షలకు పైగా ప్రింట్ చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్ (VV Pat)ల కమిషనింగ్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయ్యింది. 35, 356 పోలింగ్ కేంద్రాలకు 59, 775 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ (GPS) ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‎పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సునిశిత ప్రాంతాలను గుర్తించిన పోలీసుశాఖ (Police Department).. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ సారి లక్ష మందికిపైగా భద్రతా సిబ్బందిని వినియోగించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి వందకుపైగా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. ఎన్నికలకు ఈసారి 375 కంపెనీలను వినియోగిస్తున్నారు. ఒక్కో కంపెనీకి 60-80 మంది చొప్పున సుమారు 25 వేల మంది ఉంటారు. వీరిలో హోంగార్డు నుంచి, కానిస్టేబుల్‌ స్థాయి అధికారులు, వారిని ముందుండి నడిపించే ఎస్పీ (SP) స్థాయి అధికారులు సైతం ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 65 వేలకు పైగా ఉన్న పోలీసులు (Police), 18 వేల మందికిపై హోంగార్డు (HomeGuard) సిబ్బందిని మొత్తం కలిపి 50 నుంచి 60 వేల వరకు తెలంగాణ పోలీసులశాఖ ఎన్నికల విధుల్లోకి తీసుకుంటోంది. వివిధ శాఖల సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ అన్ని చర్యలు తీసుకుంటోంది. అలాగే సరిహద్దుల్లో 148 చెక్ పోస్టులు (Checck Posts) ఏర్పాటు చేసింది.

దేశ వ్యాప్తంగా ఐదు (Five) రాష్ట్రాల ఎన్నికలకు నవంబర్ 3న షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‎గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తికాగా..ఎల్లుండి తెలంగాణలో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు (Counting) చేపట్టి, ఐదు రాష్ట్రాల ఫలితాలను (Results) వెల్లడించనున్నారు.

Updated On 28 Nov 2023 12:18 AM GMT
Ehatv

Ehatv

Next Story