14 days baby Rare Operation : 14 రోజుల పసికందు కడుపులో నుండి 3 పిండాలను తీసిన అరుదైన ఘటన .!
యూపీలోని (up)వారణాసిలో (Varanasi)ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. BHU వైద్యులు 14 రోజుల చిన్నారికి ఆపరేషన్ చేసి కడుపు నుండి 3 పిండాలను బయటకు తీశారు. ఏడుగురు వైద్యుల బృందం మూడు గంటల తీవ్ర కృషి చేసి ఈ ఆపరేషన్ విజయవంతం చేసారు . ఈ అరుదైన వింత డాక్టర్లను సైతం ఆశ్చర్యపరిచింది. మొత్తానికి చిన్నారిని కాపాడి రికార్డు సృష్టించారు అక్కడ వైద్యులు .డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టినప్పుడు బిడ్డ బరువు 3.3 కిలోలు కాగా, ఆపరేషన్ తర్వాత ప్రస్తుతం అతని బరువు 2.8 కిలోలకు చేరుకుంది .

వారణాసి , మౌ జిల్లాకు చెందిన దంపతులు తమ 10 రోజుల బిడ్డతో BHU హాస్పిటల్ కి వచ్చినట్లు డాక్టర్ షెట్ కచాప్ చెప్పారు. ఈ పిల్లవాడికి కడుపు వాపు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఉన్నట్లు చెప్పారు . పిల్లల అల్ట్రాసౌండ్(ultra sound) చేసినప్పుడు, ఆ పసి కందు కడుపులో పిండంఉందని అనుమానించారు ఆ తర్వాత సీటీ స్కాన్ (Citi scan)ద్వారా నిర్దారించారు . అప్పుడే పుట్టిన బాలుడి కడుపులో పిండాలు ఉండటం అక్కడ వారందరిని ఆశ్చర్య పరిచింది .
మూడురోజులపాటు అతిజాగ్రత్తగా జరిపిన చికిత్స అనంతరం సర్ సుందర్‌లాల్ ఆస్పత్రి (sir sundarlal hospital)వైద్యుల బృందం సోమవారం చిన్నారికి ఆపరేషన్ చేసింది. ఈ సమయంలో వెలికితీసిన మూడుపిండాలను వివిధ దశల్లో కనుగొన్నారు. ఈ వ్యాధి చాలా అసాధారణమైనది అని వైద్యులు చెప్పారు. ఇటువంటి సమస్య 5 లక్షల మందిలో 1 బిడ్డలో కనిపిస్తుంది. పిండం తల్లి గర్భధారణ సమయంలో మాత్రమే పిల్లల కడుపులోకి ప్రవేశిస్తుంది, ఇది అభివృద్ధి చెందదు అని చెప్పారు .ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆర్యోగ్యంతో ఉన్నట్లు ఆసుపత్రి బృందం వెల్లడించింది .
డాక్టర్ రుచిరా నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో డాక్టర్ షేట్ కచ్చప్, డాక్టర్ చేతన్, డాక్టర్ గ్రీష్మ మరియు అనస్థీషియా డాక్టర్ అమృత, డాక్టర్ అభా మరియు హృతిక్ సహకరించారు. ఈ చిన్నారికి BHUలోని సర్ సుందర్‌లాల్ హాస్పిటల్‌లో(sir sundar lal hospital) ఉచితంగా ఆపరేషన్ (free operation)చేయటం విశేషం .డాక్టర్ల చేసిన కృషికి చిన్నారి ప్రాణాలను కాపాడినందుకు ఆ తల్లితండ్రులు ఆసుపత్రి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు