ఇటీవల బెంగళూరు(Bengaluru) నగరంలో జీరో షాడో డే(Zero Shadow Day) జరిగింది కదా! అలాంటి అద్భుత దృశ్యమే ఇవాళ మన హైదరాబాద్(Hyderabad)లో ఆవిష్కృతం కాబోతున్నది. సరిగ్గా 12 గంటల 12 నిమిషాలకు మన నీడ మనకు కనిపించకుండా అదృశ్యం కాబోతుంది. సాధారణంగా ఒక వస్తువుపై సూర్య కిరణాలు పడితే వస్తువు వ్యతిరేక దిశలో నీడ ఏర్పడుతుంది. కానీ ఇవాళ మాత్రం కాసేపు నీడ మాయమవుతుంది.
ఇటీవల బెంగళూరు(Bengaluru) నగరంలో జీరో షాడో డే(Zero Shadow Day) జరిగింది కదా! అలాంటి అద్భుత దృశ్యమే ఇవాళ మన హైదరాబాద్(Hyderabad)లో ఆవిష్కృతం కాబోతున్నది. సరిగ్గా 12 గంటల 12 నిమిషాలకు మన నీడ మనకు కనిపించకుండా అదృశ్యం కాబోతుంది. సాధారణంగా ఒక వస్తువుపై సూర్య కిరణాలు పడితే వస్తువు వ్యతిరేక దిశలో నీడ ఏర్పడుతుంది. కానీ ఇవాళ మాత్రం కాసేపు నీడ మాయమవుతుంది. ఇలాంటి సందర్భాలు ఏడాదిలో రెండుసార్లు వస్తాయి. మే 9వ తేదీ అంటే ఈరోజు, మళ్లీ ఆగస్టు 3వ తేదీలలో ఛాయ కనిపించదు. ఏడాది మొత్తం సూర్యకిరణాలు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు, దిశ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు ఇలాగే నీడను చూసి సమయం చెప్పేవారు. భూభ్రమణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి, సూర్యుని మధ్యరేఖను సౌర క్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది. అది ఇవాళ మధ్యాహ్నం 12 గంటలా 12 నిమిషాలకు మన హైదరాబాద్‌లో సంభవిస్తుంది. అదుదైన ఈ దృశ్యాన్ని చూడటం మర్చిపోకండి...