జాంబియాకు(Zambia) చెందిన యువతి డ్రగ్స్‌ కేసులో(Drugs) దొరికింది. ఈ యువతికి 14 ఏళ్ల పాటు ఎల్బీనగర్‌ కోర్టు(LB Nagar Court) శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. 2021లో జాంబియా నుంచి ఓ యువతి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చింది. 8,050 గ్రాముల హెరాయిన్‌ను(Heroin) మహిళ తన సూట్‌కేసు రాడ్లలో పెట్టి తీసుకొచ్చింది.

జాంబియాకు(Zambia) చెందిన యువతి డ్రగ్స్‌ కేసులో(Drugs) దొరికింది. ఈ యువతికి 14 ఏళ్ల పాటు ఎల్బీనగర్‌ కోర్టు(LB Nagar Court) శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. 2021లో జాంబియా నుంచి ఓ యువతి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చింది. 8,050 గ్రాముల హెరాయిన్‌ను(Heroin) మహిళ తన సూట్‌కేసు రాడ్లలో పెట్టి తీసుకొచ్చింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా అందులో ఆమెకు సంబంధించిన సూట్‌కేసుల్లో 8 కిలోలకుపైగానే డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు విచారణలో జాంబియా మహిళను ఎల్బీనగర్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఈరోజు నిందితురాలికి 14 సంవత్సరాల కఠిన కరాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానాను ఎల్బీనగర్ కోర్టు విధించింది.

Updated On 1 Feb 2024 7:35 AM GMT
Ehatv

Ehatv

Next Story