తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి నిరుద్యోగికి 1,60,000/- రూపాయిలు బాకీ ఉంద‌ని జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ అన్నారు. ముఖ్య‌మంత్రి నియోజ‌క‌వ‌ర్గం గజ్వేల్ లో జ‌రిగిన యువ పోరాట యాత్రలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగుల చావులు ఆగాలని అన్నారు.

తెలంగాణ(Telangana)లో కేసీఆర్(CM KCR) ప్రభుత్వం ప్రతి నిరుద్యోగికి 1,60,000/- రూపాయిలు బాకీ ఉంద‌ని జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్(National Youth Congress President BV Srinivas) అన్నారు. ముఖ్య‌మంత్రి నియోజ‌క‌వ‌ర్గం గజ్వేల్(Gajwel) లో జ‌రిగిన యువ పోరాట యాత్ర(Yuva Porata Yathra)లో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగుల చావులు ఆగాలని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు దగా కోర్ కేసీఆర్ పై యూత్ కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఎదురు బావుటా ఎగరవేసిన యూత్ కాంగ్రెస్.. "ప్రతి ఇంటికి యువజన కాంగ్రెస్" పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. యూత్ కాంగ్రెస్(Youth Congress) డోర్ టు డోర్ క్యాంపెయిన్(Door to door Campaign) ఈరోజు నుండి తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ప్రారంభం కానున్నట్లు వెల్ల‌డించారు. ఎమ్మెల్యేల అవినీతిపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తామ‌ని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి(Unemployment Benefit) ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. నిరుద్యోగులకు రుణాలు మంజూరు చేస్తామ‌న్నారు. నిరుద్యోగ భృతి కల్పిస్తామ‌ని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి(Shivasena Reddy) ఇత‌ర‌ యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Updated On 5 July 2023 9:06 PM GMT
Yagnik

Yagnik

Next Story