తెలంగాణ(Telangana) పీసీసీ(PCC) చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై(Revanth Reddy) వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) అధినేత్రి షర్మిల(sharmila) రెడ్డికి పీకల్దాకా కోపం ఉన్నట్టుగా ఉంది! ఆయనపై పరోక్షంగా విమర్శలు, వాటితో పాటు కొన్ని సెటైర్లు వేశారు షర్మిల. కాంగ్రెస్‌లో(Congress) వైఎస్‌ఆర్‌టీపీని విలీనం చేయడానికి షర్మిల చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది రేవంత్‌రెడ్డినేనన్నది బహిరంగ రహస్యమే. తన పార్టీ విలీనాన్ని అడ్డుకున్న రేవంత్‌పై షర్మిలకు చాలా కోపం ఉంది. ఆ మాటకొస్తే మొదట్నుంచి రేవంత్‌ అంటే ఎందుకో షర్మిలకు అదో రకమైన చిరాకు.

తెలంగాణ(Telangana) పీసీసీ(PCC) చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై(Revanth Reddy) వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) అధినేత్రి షర్మిల(sharmila) రెడ్డికి పీకల్దాకా కోపం ఉన్నట్టుగా ఉంది! ఆయనపై పరోక్షంగా విమర్శలు, వాటితో పాటు కొన్ని సెటైర్లు వేశారు షర్మిల. కాంగ్రెస్‌లో(Congress) వైఎస్‌ఆర్‌టీపీని విలీనం చేయడానికి షర్మిల చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది రేవంత్‌రెడ్డినేనన్నది బహిరంగ రహస్యమే. తన పార్టీ విలీనాన్ని అడ్డుకున్న రేవంత్‌పై షర్మిలకు చాలా కోపం ఉంది. ఆ మాటకొస్తే మొదట్నుంచి రేవంత్‌ అంటే ఎందుకో షర్మిలకు అదో రకమైన చిరాకు. రేవంత్‌ పాదయాత్రపై ఆమె చేసిన కామెంట్‌ ఇప్పటికీ వైరల్‌ అవుతూనే ఉంది. ఆ విషయం పక్కన పెడితే ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్‌రెడ్డి అని చాలా సార్లు షర్మిల వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిని రేటెంత రెడ్డి అని చాలా మంది అంటూ ఉంటారని, అలాంటి దొంగలు ముఖ్యమంత్రి కాకూడదని అన్నారు. రేవంత్‌ను దొంగ అన్నది తాను కాదని, సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే ఆ మాట అన్నదని చెబుతూ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం దొంగల చేతికి వెళ్లకూడదని తాను కోరుకుంటున్నానని షర్మిల అన్నారు. పార్టీ విలీనాన్ని అడ్డుకున్న రేవంత్‌ అభద్రతా భావంతో ఆ పని చేశారని, తాను వస్తే తన పదవి ఎక్కడ చేజారుతుందోనన్న భయంతో ఆయన ఉన్నాడని షర్మిల మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు. ఆ సంగతి అలా ఉంచితే రేవంత్‌రెడ్డికి మాత్రం ముఖ్యమంత్రిని(CM) కావాలన్న కోరిక చాలా బలంగా ఉంది. సీఎంను సోనియా(Sonia Gandhi), రాహుల్‌(Rahul gandhi), ఖర్గే(Mallikarjun Kharge) నిర్ణయిస్తారని కాంగ్రెస్‌లోని సీనియర్లు అంటూ ఉంటే రేవంత్‌ మాత్రం కొడంగల్ బిడ్డకు రాష్ట్ర నాయకత్వం దక్కబోతుందని వ్యాఖ్యానించారు. ఇవాళ నామినేషన్‌ వేస్తూ ఆ మాటన్నారు. అంటే తాను ముఖ్యమంత్రిని కాబోతున్నానని పరోక్షంగా చెప్పుకుంటున్నారు రేవంత్‌.

Updated On 6 Nov 2023 7:03 AM GMT
Ehatv

Ehatv

Next Story