వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) పరిస్థితి ఏమిటి? తెలంగాణలో షర్మిల పార్టీ పోటీ చేస్తుందా? లేదా? కాంగ్రెస్‌ పార్టీలో విలీనంపై ఓ క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్‌లో(Congress) విలీనం లేదని షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని స్థానాలలో పోటీ చేస్తామని ప్రకటించారు. కార్యకర్తల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు. చాలా నియోజకవర్గాలలో పోటీకి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన హడావుడి ఆ పార్టీలో కనిపించడం లేదు. షర్మిల కూడా ఎన్నికలకు సంబంధించి ఎక్కడా కామెంట్‌ చేయడం లేదు.

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) పరిస్థితి ఏమిటి? తెలంగాణలో షర్మిల పార్టీ పోటీ చేస్తుందా? లేదా? కాంగ్రెస్‌ పార్టీలో విలీనంపై ఓ క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్‌లో(Congress) విలీనం లేదని షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని స్థానాలలో పోటీ చేస్తామని ప్రకటించారు. కార్యకర్తల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు. చాలా నియోజకవర్గాలలో పోటీకి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన హడావుడి ఆ పార్టీలో కనిపించడం లేదు. షర్మిల కూడా ఎన్నికలకు సంబంధించి ఎక్కడా కామెంట్‌ చేయడం లేదు. కేసీఆర్‌ను(KCR) లక్ష్యంగా చేసుకుని షర్మిల(Sharmila) పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. పాదయాత్రలు చేశారు. పాలేరులో పోటీ చేస్తానని ప్రకటించారు. నిజానికి మిగతా విపక్షాలన్ని నిర్లిప్తంగా ఉన్న సమయంలో షర్మిల పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. నిరసనలు తెలిపారు. ధర్నాలు చేశారు. అలాంటి షర్మిల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు. రెండు నెలల కిందట వరకు షర్మిల వార్తల్లో వ్యక్తిగా ఉండేవారు. పార్టీ విలీనానికి సంబంధించిన చర్చ చాలానే జరిగింది. అయితే వీలినానికి అడ్డుపుల్ల వేసిందెవరనేదానిపై కూడా పలు చర్చలు జరిగాయి. రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) వల్లే షర్మిల తన పార్టీని విలీనం చేయలేకపోయారనే టాక్‌ కూడా వినిపించింది. సరే, ఇప్పుడు షర్మిల పార్టీ పరిస్థితి ఏమిటి? అన్ని స్థానాలలో పోటీ చేస్తామని షర్మిల ప్రకటించి కూడా చాలా రోజులయ్యింది. ప్రధానపార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలుగా ఉన్నాయి. అధికారపక్షం ఎప్పుడో లిస్ట్‌ను ప్రకటించింది. కాంగ్రెస్‌ నుంచి కూడా ఫస్ట్‌ లిస్ట్‌ వచ్చేసింది. ఈ సమయంలో షర్మిల పార్టీకి చెందిన లిస్ట్ ఎందుకు రావడం లేదు? బీఆర్‌ఎస్‌ను ఓడిస్తాం, కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తామంటూ చెబుతూ వచ్చిన షర్మిల ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారు? అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించడానికి కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? తెలంగాణలో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు తెలంగాణ తెలుగుదేశంపార్టీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. టీటీడీపీలో(TTDP) కొంతమంది నేతలు ఉన్నారు. ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌ అయినప్పడు ఇక్కడా కూడా కొన్ని ధర్నాలు, ఆందోళనలు జరిగాయి.ఏపీతో పాటు తెలంగాణలో కూడా టీడీపీ(TDP) బలం పెరుగుతుందని నేతలు ప్రకటించారు. ఖమ్మంలో అయితే భారీ బహిరంగసభలను ఏర్పటు చేశారు. తాము కింగ్‌ కాలేకపోయినా కింగ్‌ మేకర్‌ అయ్యి తీరతామని తెలిపారు. అలాంటి టీటీడీపీ కూడా ఎన్నికల్‌ షెడ్యూల్‌ వచ్చిన తర్వాత మౌనంగా ఉంటోంది. పోటీ చేస్తుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అలసు టీటీడీపీలో ఏం జరుగుతోంది? తెలంగాణలో పోటీ చేస్తారా? లేదా? ఈ వీడియోలో తెలుసుకుందా!

Updated On 26 Oct 2023 1:34 AM GMT
Ehatv

Ehatv

Next Story