YSRTP Sharmila : కేసీఆర్‌కు షర్మిల 'సూట్‌కేస్' గిఫ్ట్..!
వైఎస్సార్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల రెడ్డి(YS Sharmila Reddy) సీఎం కేసీఆర్‌పై(CM KCR) విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు(TS Polling) సంబంధించి ఎగ్జిట్ పోల్స్(Exist Polls) అన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కేసీఆర్‌కు ఓ గిప్ట్(Gift) పంపారు.
వైఎస్సార్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల రెడ్డి(YS Sharmila Reddy) సీఎం కేసీఆర్‌పై(CM KCR) విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు(TS Polling) సంబంధించి ఎగ్జిట్ పోల్స్(Exist Polls) అన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కేసీఆర్‌కు ఓ గిప్ట్(Gift) పంపారు. 'తెలంగాణ పీపుల్ సే గుడ్ బై టూ కేసీఆర్'(TS People Say Good Bye To KCR) అని రాసి ఉన్న సూట్‌కేసును(Suitcase) గిప్ట్‌గా పంపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మీడియా సమావేశంలో(Press Meet) ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఇక తెలంగాణలో అధికారంలోకి రాదని.. సూట్‌కేస్ సర్దుకోవాల్సిందే అని గిఫ్ట్ ఇస్తూ చెప్పారు. కేసీఆర్ అన్నీ ప్యాక్ చేసుకుని సూట్‌కేస్‌తో వెళ్లిపోవాలని అన్నారు. బైబై కేసీఆర్.. కేసీఆర్ సూట్‌కేస్ పట్టుకుని సర్దుకునే టైమ్ వచ్చిందని అన్నారు. అన్నీ ప్యాక్ చేసుకుని పెట్టుకోవాలని అన్నారు. అందుకే ఆయన బైబై కేసీఆర్ సూట్‌కేస్ గిఫ్ట్‌గా పంపిస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్‌ను ఓడించాలనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు(Congress) మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ పాలనకు ఎండ్ కాడ్ పడబోతుందన్నారు. 2018, 2023 ఎన్నికల్లో కేవలం పదివేల తేడాతో గిలిచిన ఎమ్మెల్యేలు 33 మంది మాత్రమే.. కర్నాటక ఎన్నికల్లో 71 మంది పదివేల మెజార్టీతో గెలిచారు. పదివేల మెజార్టీ అయినా కూడా ముఖ్యం కాబట్టి.. మేము పోటీ చేసి ఒకవేల 5,000 ఓట్లు చీల్చినా తేడా వస్తుంది. కేసీఆర్ ను ఓడించాలని కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామని వివరించారు.
2014, 2018లో 45 మందిని కేసీఆర్ కొన్నాడు. కేసీఆర్ ఎమ్మెల్యేలు 40, ఎమ్మెల్సీ 4, ఎంపీ 1 ని కొన్నారని వివరించారు. ఇది మళ్లీ రిపీట్ కాకూడదు.. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి అధికారంలోకి వచ్చే విధంగా చేయకూడదని కేసీఆర్ ను మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో క్రెడిబిలిటీ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం మారాలి. ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.