వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సీఎం కేసీఆర్‌పై మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి సోమేశ్ కుమార్ నియామకాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ మేరకు ఆమె స్పందిస్తూ.. చెవిటోని ముందు శంఖం ఊదినట్లు.. సలహాలు తీసుకోనోళ్లకు సలహాదారులు ఎందుకో? అని ఎద్దేవా చేశారు.

YSRTP Chief YS Sharmila Criticized CM KCR and Somesh Kumar Relationship
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila).. సీఎం కేసీఆర్(CM KCR)పై మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి సోమేశ్ కుమార్(Somesh Kumar) నియామకాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ మేరకు ఆమె స్పందిస్తూ.. చెవిటోని ముందు శంఖం ఊదినట్లు.. సలహాలు తీసుకోనోళ్లకు సలహాదారులు ఎందుకో? అని ఎద్దేవా చేశారు. నియంత నిర్ణయాలతో కేసీఆర్ తెలంగాణ(Telangana)ను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఒంటెద్దు పోకడతో కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. ప్రజల గోస వినే కమిషన్లకు ఆఫీసర్లు లేరు కానీ.. దొరకు దోచిపెట్టే సలహాదారులను పక్కన చేర్చుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ.. పక్కరాష్ట్రాల మందికి లక్షలు జీతమిచ్చి మేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి పని చేస్తున్నారని.. వీళ్ళు రుణమాఫీ అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పేదలకు ఇండ్లు కట్టి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? రైతుబీమా అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పోడు పట్టాలు, నిరుద్యోగ భృతి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? ఇచ్చేవాళ్లు అయితే.. వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు.? సమాధానం చెప్పండి కేసీఆర్.? ప్రశ్నల వర్షం కురిపించారు.
