YSR Sharmila : ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
వైఎస్ఆర్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Election) వైఎస్ఆర్టీపీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి తాము దూరంగా ఉంటున్నామని..

YSR Sharmila
వైఎస్ఆర్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Election) వైఎస్ఆర్టీపీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి తాము దూరంగా ఉంటున్నామని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీకి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నామని.. తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని షర్మిల చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు.
ఈ ఎన్నికల్లో కేసీఆర్(KCR) ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాము నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డకోకూడదనే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. తన నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని కోరారు.
