ఏపీ సీఎం జ‌గ‌న్ త‌ల్లి వైఎస్ విజయమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది. వివ‌రాళ్లోకెళితే.. శుక్రవారం మధ్యాహ్నాం విజయమ్మ ఒంగోలుకు వెళ్తుండగా సంతమంగలూరు వద్ద ఆమె కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. దీంతో ఆమె కాన్వాయ్ లోని మరో కారు ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది.

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌ల్లి వైఎస్ విజయమ్మ(YS Vijaymma)కు తృటిలో ప్రమాదం తప్పింది. వివ‌రాళ్లోకెళితే.. శుక్రవారం మధ్యాహ్నాం విజయమ్మ ఒంగోలు(Ongolu)కు వెళ్తుండగా సంతమంగలూరు వద్ద ఆమె కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. దీంతో ఆమె కాన్వాయ్ లోని మరో కారు ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది. విజయమ్మతో పాటు కారులోని వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలావుంటే.. వైఎస్‌ విజయమ్మ తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నార‌నే వార్త‌లు వినవ‌స్తున్నాయి. ఆమె కూతురు ష‌ర్మిల స్థాపించిన వైఎస్సార్టీపీ పార్టీ త‌రుపున సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి విజ‌య‌మ్మ బ‌రిలో ఉంటార‌ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ ఒంటరిగానే పోటీ చేయబోతోందని షర్మిల ప్ర‌క‌టించారు. మొత్తం 119 స్థానాల్లో వైెఎస్సార్టీపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలనుకున్నామని.. ఆ క్రమంలోనే కాంగ్రెస్ తో చర్చలు జరిపామని వెల్లడించారు. అందుకే.. కాంగ్రెస్ నిర్ణయం కోసం 4 నెలలు వేచి చూశామని అన్నారు. తాను పాలేరుతో పాటు మరో స్థానంలో కూడా పోటీ చేస్తానని, విజయమ్మ, అనిల్ కూడా పోటీ చేయాలనే డిమాండ్లు ఉన్నాయని చెప్పారు.

"Written By : Senior Journalist Sreedhar"

Updated On 18 Oct 2023 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story