వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) పాలేరు నియోజకవర్గం(Palair constituency) నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పాలేరులో వైఎస్సార్టీపీ బూత్ కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి నియోజక వర్గం నుంచి కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. సమావేశంలో వారు వైఎస్ షర్మిలను అధిక మెజారిటీతో గెలిపిస్తామని తీర్మానం చేశారు. అయితే.. కాంగ్రెస్‌కు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy)కి షర్మిల అభ్యర్థిత్వం పెద్ద సవాల్‌గా మారనుందని వైఎస్‌ఆర్‌టీపీ అంచనా వేస్తోంది. అయితే.. వైఎస్ విజయమ్మ కూడా పాలేరు నుంచి బరిలో దిగనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏ విషయమైనది స్పష్టత రావాల్సివుంది.
నిన్నటి బూత్ కార్యకర్తల సమావేశం అనంతరం వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి(Pitta Ramredd) మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు కాంట్రాక్టర్లకు, ప్రజా సేవ చేసే వాళ్లకు మధ్య జరిగే ఎన్నికలుగా అభివర్ణించారు. ప్రజా సేవ చేసే వైఎస్ షర్మిల రెడ్డి పాలేరులో భారీ మెజారిటీతో గెలుస్తారని జోష్యం చెప్పారు. రెండున్నర ఏళ్ల నుంచి మా నాయకురాలు ప్రజా సేవలో ఉన్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం షర్మిల పాలేరు నుంచే పోటీ చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్సార్(YS Rajashekhar Reddy) బిక్షతో రాజకీయంగా ఎదిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇవాళ వైఎస్సార్టీపీ అధినేత్రి పట్ల చులకనగా మాట్లాడుతున్నారయని ఫైర్ అయ్యారు. పొంగులేటి వైఖరిని వైఎస్సార్టీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పాలేరులో ఎగిరేది వైఎస్సార్టీపీ జెండానే అని ఘంటాపథంగా చెప్పారు.