కాంగ్రెస్(congress) పార్టీలో వైఎస్సార్టీపీ(YSRTP) విలీనం వార్త‌ల‌పై ష‌ర్మిల ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. విలీన‌ వార్త‌ల‌ను ఆమె ఖండించారు. ఆమె పోస్టులో.. వైఎస్ షర్మిల రెడ్డి(YS Sharmila Redy) తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ(telangana) కొరకు పోరాడుతూనే ఉంటదని స్పష్టం చేశారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయి.

కాంగ్రెస్(congress) పార్టీలో వైఎస్సార్టీపీ(YSRTP) విలీనం వార్త‌ల‌పై ష‌ర్మిల ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. విలీన‌ వార్త‌ల‌ను ఆమె ఖండించారు. ఆమె పోస్టులో.. వైఎస్ షర్మిల రెడ్డి(YS Sharmila Redy) తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ(telangana) కొరకు పోరాడుతూనే ఉంటదని స్పష్టం చేశారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయి. పనిలేని, పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే.. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి. అన్నివిధాలుగా కేసీఆర్(KCR) సర్కారు పాలనలో.. సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవిత మీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే.. తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే.. జై తెలంగాణ అని రాసుకొచ్చారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీని(YSRTP) కాంగ్రెస్(Congress) పార్టీలో విలీనం చేస్తారనే వార్తలు గత కొంతకాలంగా మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌టీపీ విలీనానికి రంగం సిద్దమైనట్లు.. జులై 8న ముహూర్తం కూడా ఖరారు అయినట్లు.. ఇడుపులపాయ వేదికగా విలీనంపై షర్మిల ప్రకటన చేయనున్నారని వార్తలొచ్చాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో విలీన ప్రకటన చేస్తారని ప్రచారం కూడా జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల ట్వీట్ ఊహాగానాల‌కు చెక్ పెట్ట‌నుంద‌ని భావిస్తున్నారు.

Updated On 23 Jun 2023 6:33 AM GMT
Ehatv

Ehatv

Next Story