నిన్న పోలీసులపై దాడి చేశారనే కేసులో YSRTP అధ్యక్షురారు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.. అయితే దానిపై బెయిల్ కోరిన షర్మిల తరుపు న్యాయవాదులు హైకోర్టు ఆదేశాల మేరకు రూ.30వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీల తరఫు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. దానితో నాంపల్లి కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది.
నిన్న పోలీసులపై దాడి చేశారనే కేసులో YSRTP అధ్యక్షురారు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.. అయితే దానిపై బెయిల్ కోరిన షర్మిల తరుపు న్యాయవాదులు హైకోర్టు ఆదేశాల మేరకు రూ.30వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీల తరఫు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. దానితో నాంపల్లి కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె పోలీస్ అధికారిపై చేయిచేసుకోవడంతో పాటు మహిళా కానిస్టేబుల్‌ను నెట్టివేశారు అనేదానిపై షర్మిల స్పందించారు.. సెల్ఫ్ కంట్రోల్ కోసమే ఆలా చేశానని, పోలీసులు తనతో ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించారని షర్మిల తెలిపారు. తెలంగాణ మరో ఆఫ్ఘనిస్తాన్ లాగా మారిందని.. కేసీఆర్ తాలిబన్ల మాదిరిగా పాలనసాగిస్తున్నారని ఆమె విమర్శించారు... తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారు..