ఎవరి బాణం..ఎవరికి ఫోన్.. ! || What Is YS Sharmila Call Strategy..? || Revanth Reddy || Bandi Sanjay
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉదృతం చేయాలనీ భావిస్తున్నారు. ఇందుకోసం ఆమె కలిసి పోరాడతానని తెలిపారు.. దానికోసం విపక్షాలకు ఆహ్వానం పలికారు. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉదృతం చేయాలనీ భావిస్తున్నారు. ఇందుకోసం ఆమె కలిసి పోరాడతానని తెలిపారు.. దానికోసం విపక్షాలకు ఆహ్వానం పలికారు. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల అంశంపై కలిసి పోరాడదామని ఆమె పిలుపునిచ్చారు. అయితే దీనికి బండి సంజయ్ (Bandi Sanjay) ఓకే చెప్పారని.. త్వరలో సమావేశమై ఉమ్మడి పోరాటంపై చర్చిద్దామన్నారని షర్మిల వెల్లడించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) సైతం కలిసి పోరాటం చేయడానికి ఆసక్తిగా ఉన్నారని, పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని హమీ ఇచ్చినట్లు షర్మిల తెలిపారు.. అయితే ఇది కేవలం షర్మిల వైపు నుంచి వచ్చిన ప్రకటన మాత్రమే.. దీని గురించి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.. ఈ విషయంపై బీఆర్ఎస్ (BRS) నేతలు స్పందించారు.. షర్మిల ఫోన్ కాల్ ఒక బూటకమని.. YSRTP తెలంగాణకు ఎటువంటు ఉపయోగం ఉండదని తెలిపారు.. ఇంతకీ షర్మిల ఫోన్ కాల్ నిజమేనా... ఒకవేళ ఇది నిజమైతే కాంగ్రెస్, బీజేపీ కలిసి ఒకేవేదికపైకి వస్తాయా..?