వైఎస్‌ఆర్‌ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి షర్మిల(YSRTP Chief YS Sharmila) ఓ కొత్త ప్రపోజల్‌ను తీసుకొచ్చారు. కేసీఆర్‌ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలనే ప్రతిపాదనతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ (BJP Leader bandi Sanjay), తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy)లకు ఫోన్‌ చేశారు. నిరుద్యోగ అంశంపై కలిసి పోరాడదామని రిక్వెస్ట్ చేశారు.

వైఎస్‌ఆర్‌ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి షర్మిల(YSRTP Chief YS Sharmila) ఓ కొత్త ప్రపోజల్‌ను తీసుకొచ్చారు. కేసీఆర్‌ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలనే ప్రతిపాదనతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ (BJP Leader bandi Sanjay), తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy)లకు ఫోన్‌ చేశారు. నిరుద్యోగ అంశంపై కలిసి పోరాడదామని రిక్వెస్ట్ చేశారు. ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని, ప్రగతిభవన్‌ మార్చ్‌ పిలుపునిద్దామని సూచించారు. కలిసిపోరాటం చేయకపోతే కేసీఆర్‌ ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరని షర్మిల అన్నారు. షర్మిల ఫోన్‌ కాల్‌పై బండి సంజయ్‌ సానుకూలంగా స్పందించారని వైఎస్‌ఆర్‌ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అంటోంది. అదే విధంగా పార్టీతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని రేవంత్‌ అన్నట్టుగా వైఎస్‌ఆర్‌టీపీ చెబుతోంది. కాకపోతే అటు బండి సంజయ్‌ కానీ, ఇటు రేవంత్‌రెడ్డి కానీ దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని రేవంత్‌రెడ్డి అన్నారని షర్మిల పార్టీ చెబుతున్నది కానీ నిన్నమొన్నటి వరకు తనను షర్మిల తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన విషయాన్ని రేవంత్‌ మర్చిపోతారా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పైగా బద్ధశత్రువైన బీజేపీ(bjp)తో కలసి కాంగ్రెస్‌ ఎలా పని చేస్తుంది? ఇది అయ్యే పనేనా? విపక్షాల ఉమ్మడి పోరాటం ఎలా సాధ్యం? వీటికి సమాధానాలు దొరికితే విపక్షాల ఐక్యత గురించి ఆలోచించుకోవచ్చన్నది కొందరి భావన!

Updated On 1 April 2023 2:21 AM GMT
Ehatv

Ehatv

Next Story