వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటనకు బయలుదేరనున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం గజ్వేల్ నియోజక వర్గంలోని జగదేవ్ పూర్ మండలం, తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించనున్నారు.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం కేసీఆర్(CM KCR) నియోజకవర్గం గజ్వేల్(Gajwel)లో పర్యటనకు బయలుదేరనున్నారు. సిద్దిపేట(Siddipet) జిల్లా కేంద్రం గజ్వేల్ నియోజక వర్గంలోని జగదేవ్ పూర్(Jagdevpur) మండలం, తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించనున్నారు. లోటస్ పాండ్(Lous Pond) నివాసం నుంచి బయలుదేరి షర్మిల.. రోడ్డుమార్గాన తీగుల్ గ్రామానికి వెళ్లనున్నారు. దళితబందు(Dalit Bandu) పథకంలో అక్రమాలపై ప్రశ్నించాలని స్థానికుల నుంచి ఆహ్వానం రావడంతో ఆమె గజ్వేల్ వెళ్తున్నారు. అయితే.. లోటస్ పాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పర్యటనకు వెళ్లనుండా షర్మిలని హౌస్ అరెస్ట్(House Arrest) చేసే ప్రయత్నం చేస్తున్నారు.
గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామ వాసులు షర్మిలకి వినతిపత్రం పంపించారు. ఇటీవల తీగుల్ గ్రామంలో సీఎం దిష్టిబొమ్మ దగ్దం చేసి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. దళితబందు పథకంలో అక్రమాలు జరిగాయని.. అర్హులకు దక్కడం లేదని జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలనుంచి వచ్చిన వినతి మేరకు షర్మిల నేడు తీగుల్ గ్రామానికి వెళ్లనున్నారు.