వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లా తణికెళ్ల గ్రామంలో పర్యటిస్తున్న ఆమె సొమ్మసిల్లి పడిపోయినట్లుగా పార్టీ శ్రేణులు తెలిపారు. తీవ్రమైన ఎండలో తణికెళ్ల గ్రామంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటను ఆమె పరిశీలించారు.

YS Sharmila got sun stroke while her tour in Khammam district Tanikella
వైఎస్ఆర్టీపీ(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం(Khammam) జిల్లా తణికెళ్ల(Tanikella) గ్రామంలో పర్యటిస్తున్న ఆమె సొమ్మసిల్లి పడిపోయినట్లుగా పార్టీ శ్రేణులు తెలిపారు. తీవ్రమైన ఎండలో తణికెళ్ల గ్రామంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటను ఆమె పరిశీలించారు. అనంతరం షర్మిల రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే షర్మిల కుప్పకూలిపోయారు. షర్మిలకు వడదెబ్బ(Sun Stroke) తగిలిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
