తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై వైఎస్ షర్మిల ట్విట్టర్ లో ఘాటుగా విమర్శలు చేశారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని అందుకే మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మహానేత వైఎస్ పాలన తెస్తామంటూ రేవంత్ రెడ్డి కొత్త జపం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు చంద్రబాబు ఎంగిలి వెతుకులకు ఆశపడి రాజశేఖర్ రెడ్డిని ఆజన్మ శత్రువు అన్నది రేవంత్ అని […]
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై వైఎస్ షర్మిల ట్విట్టర్ లో ఘాటుగా విమర్శలు చేశారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని అందుకే మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మహానేత వైఎస్ పాలన తెస్తామంటూ రేవంత్ రెడ్డి కొత్త జపం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు చంద్రబాబు ఎంగిలి వెతుకులకు ఆశపడి రాజశేఖర్ రెడ్డిని ఆజన్మ శత్రువు అన్నది రేవంత్ అని గుర్తుకు చేశారు. మహానేత మరణాన్ని కూడా అపహాస్యం చేసి మాట్లాడింది రేవంత్ రెడ్డి అని తెలిపారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డికి వైయస్సార్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. భవిష్యత్తులో వైయస్సార్ అభిమానులే బుద్ధి చెప్తారని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు.
రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన కోసమే తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందని, ఆ మహానేత ఆశయ సాధన కోసమే 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్లు తెలిపారు. కారులో తిరుగుతూ పాదయాత్ర అంటూ పాదయాత్ర అనే పదాన్ని అపహస్యం చేస్తున్నారని విమర్శ చేశారు. ఊరు ఊరు తిరుగుతూ పొర్లు దండాలు పెట్టిన ప్రజలు రేవంత్ రెడ్డి నమ్మరని షర్మిల వ్యాఖ్యానించారు.