మాజీమంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు ప్రకటించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. బుధవారం ఉదయం తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది.

మాజీమంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు(YS Viveka Murder Case)లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు(High Court) తీర్పు ప్రకటించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. బుధవారం ఉదయం తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. జస్టిస్ లక్ష్మణ్(Justice Lakshman).. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌(Bail Petition)పై వాద‌న‌లు విన్నారు. అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరరావు(Umamaheshwar Rao), సునీత(YS Sunitha) తరఫున సీనియర్ కౌన్సిల్ రవిచంద్ర(Ravi Chandra), సీబీఐ(CBI) తరఫున అనిల్ తల్వార్(Anil Talwar) లు వాదనలు వినిపించారు. మూడు రోజులు పాటు స‌దీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజ‌ర్వు చేసింది. ఈ పేప‌థ్యంలో బుధవారం ఉదయం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తీర్పు వెలువ‌డ‌నుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీల‌క్ష్మి(Sri Lakshmi) ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బుధవారం వరకు అరెస్టు(Arrest) చేయవ‌ద్ధ‌ని కోర్టు సీబీఐ సూచించింది. ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి హైదరాబాద్‌(Hyderabad)లోని ఏఐజీ హాస్పిట‌ల్‌(AIG Hospital)లో చికిత్స పొందుతున్నారు. మ‌రికొద్ది గంట‌ల్లో కోర్టు తీర్పు నేపథ్యంలో సీబీఐ తదుపరి చర్యలపై సర్వ‌త్రా ఉత్కంఠ నెలకొంది.

Updated On 30 May 2023 9:30 PM GMT
Yagnik

Yagnik

Next Story