రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. బెట్టింగ్‌ బూతానికి బలవుతున్నారు యువత.

రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. బెట్టింగ్‌ బూతానికి బలవుతున్నారు యువత. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఈ బెట్టింగ్‌లకు ఆకర్షితులవుతున్నారు. మేడ్చల్(Medchal) పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లిలో క్రికెట్ బెట్టింగ్‌(Cricket Betting )లో డబ్బులు పోగొట్టుకొని రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగులకు పాల్పడి అప్పులు చేసి వాటిని తీర్చలేక ఒత్తిడికి గురయ్యి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తాజాగా గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్(Somesh) (29) అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని సోమేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో గౌడవెల్లి(Goudvelli) పరిధిలో రైలు పట్టాలపై పడుకొని సోమేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమేశ్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని క్రికెట్ బెట్టింగ్ ముఠాలను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. యువత ఇలాంటి వ్యసనాలకు బానిస కాకుండా, పొదుపు మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు యువత దూరంగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు.

ehatv

ehatv

Next Story