ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే .. .

ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే .. . అయితే ఆరోగ్యంగా(Healthy) ఉండడానికి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం(Exersice) చేయడం, ఒత్తిడి లేకుండా హాయిగా ఉండడం మొదలైనవి అనుసరించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే ఈ మధ్య ఎక్కువగా వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో(Heart attack) అకాల మ‌ర‌ణానికి గుర‌వుతున్న సంఘటనలు ఎక్కువ అయ్యాయి. తాజాగా ఈరోజు ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ బస్టాపు(KPHB Bus stop) దగ్గరలోని ఆంజనేయస్వామి గుడిలో(TEmple) ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. కేపీహెచ్‌బీలో ఉంటున్న విష్ణువర్ధన్(31) టెంపుల్ బస్ స్టాప్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లాడు. దర్శనం చేసుకునేందుకు ఆలయ ప్రదక్షిణలు చేస్తుండగా విష్ణువర్ధన్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఇతర భక్తులు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. 30ఏళ్లకే గుండెపోటుతో విష్ణువర్ధన్ గుడిలోనే మృతి చెందాడు. విష్ణువర్ధన్ గుడి చుట్టూ తిరుగుతూ.. పడిపోయిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Eha Tv

Eha Tv

Next Story