హైద్రాబాద్ మాదాపుర్ లోని అవాస హోటల్ లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన హేమంత్ గా గుర్తించారు. హేమంత్ కొంత కాలంగా హోటల్ వర్క్(టెక్నిషియన్) చేస్తున్నాడు.

Young man Committed For Suicide due to financial problems
హైద్రాబాద్(Hyderabad) మాదాపుర్(Madapur) లోని అవాస హోటల్(Avasa Hotel) లో ఓ వ్యక్తి ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా(West Godavari)కు చెందిన హేమంత్(Hemanth) గా గుర్తించారు. హేమంత్ కొంత కాలంగా హోటల్ వర్క్(టెక్నిషియన్) చేస్తున్నాడు. అవాస హోటల్ టెర్రస్ పై ఉన్న ఇనుప రాడ్డుకు ఉరివేసుకుని హేమంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యల కారణంగా సతమతమవుతున్న హేమంత్.. తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారు.
