Venu Swamy Trolls : వేణు స్వామిపై ట్రోల్స్ అసలు కథేంటి?
వేణుస్వామి(Venu Swamy) మీద ఆదివారం నుంచి ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇలాంటివి వేణుస్వామికి కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన ట్రోల్స్‌ను ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో వేణుస్వామికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. అవహేళనలు, ఎకసెక్కాలు చాలా చేశారు. చేస్తున్నారు కూడా! ఎందుకు వేణుస్వామి టార్గెట్ అవుతున్నారంటే ఆయన చెప్పిన మాటలు చాలా సందర్భాలలో నిజమయ్యాయి. ఆయన చెబుతున్న మాటలు నచ్చనివారు ఆయన చెప్పింది ఎక్కడైనా తప్పితే దాన్ని పట్టుకుని ఆయనపై నెగటివ్ కథనాలు వండి వారుస్తున్నారు.
వేణుస్వామి(Venu Swamy) మీద ఆదివారం నుంచి ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇలాంటివి వేణుస్వామికి కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన ట్రోల్స్‌ను ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో వేణుస్వామికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. అవహేళనలు, ఎకసెక్కాలు చాలా చేశారు. చేస్తున్నారు కూడా! ఎందుకు వేణుస్వామి టార్గెట్ అవుతున్నారంటే ఆయన చెప్పిన మాటలు చాలా సందర్భాలలో నిజమయ్యాయి. ఆయన చెబుతున్న మాటలు నచ్చనివారు ఆయన చెప్పింది ఎక్కడైనా తప్పితే దాన్ని పట్టుకుని ఆయనపై నెగటివ్ కథనాలు వండి వారుస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ రెండు సంఘటనలను ఓసారి గుర్తు చేసుకుందాం! ఆయన తెలంగాణలో(Telangana) టీఆర్‌ఎస్(TRS) గెలుస్తుందని, కేటీఆర్(KTR) ముఖ్యమంత్రి అవుతారని వేణుస్వామి చెప్పారు. కానీ తెలంగాణలో టీఆర్‌ఎస్ ఓటమిపాలయ్యింది. ఇదే అదనుగా వేణుస్వామి వ్యతిరేకులు ఆయనపై ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాశారు. బూతులు తిట్టారు. తాను ఆ మాట చెప్పలేదని వేణుస్వామి క్లారిటీ ఇచ్చేంత వరకు అలా రాస్తూనే వెళ్లారు. నిజానికి ఆయన అన్న మాటలు వేరు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాదనే చెప్పారు. ఒకవేళ వస్తే అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ముమ్మాటికి రాదు, వస్తే కేటీఆర్ సీఎం అవుతారే తప్ప కేసీఆర్ కాదు అని వేణుస్వామి జవాబిచ్చారు. ఈ ఒక్క సెంటెన్స్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసి వేణుస్వామికి వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాశారు. వేణుస్వామి అంతగా వివరణ ఇచ్చుకున్నా ట్రోల్స్ మాత్రం ఆపలేదు. తాజాగా ఐపీఎల్ టోర్నమెంట్ టైటిల్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ గెల్చుకుంటుందని వేణుస్వామి అన్నట్టుగా ఓ వీడియోను సర్క్యూలేట్ చేస్తున్నారు. ఆ వీడియోలో వేణుస్వామి ఏమన్నారో మొత్తం వినకుండానే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వీడియోలో ఏముందో కూడా చూసే ఓపిక లేని వారు ఇష్టమొచ్చిన థంబ్‌నైల్స్ పెట్టి వేణుస్వామిని ట్రోల్స్ చేస్తున్నారు. వేణుస్వామిని ట్రోల్ చేస్తున్నది టీడీపీ బ్యాచే! టీడీపీ బ్యాచ్‌కు వేణుస్వామి అంటే ఎందుకు కోపమంటే...!