TS Congress BC Assembly Tickets : బీసీలకు 34 టికెట్లు సాధ్యమా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(TS Assembly Elections) దగ్గరపడుతున్నాయి. అయిదో తారీఖునో, ఆరో తారీఖునో నోటిఫికేషన్ రావచ్చని అంటున్నారు. తెలంగాణలో ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలలో రెండింటిని బీసీలకు(BC) కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(TS Assembly Elections) దగ్గరపడుతున్నాయి. అయిదో తారీఖునో, ఆరో తారీఖునో నోటిఫికేషన్ రావచ్చని అంటున్నారు. తెలంగాణలో ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలలో రెండింటిని బీసీలకు(BC) కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో తమకు మూడు స్థానాలు కావాలని బీసీ నాయకులు ఇంతకు ముందే డిమాండ్ చేశారు. కనీసం రెండు స్థానాలైనా ఇవ్వాలని టీపీసీసీ(TPCC) చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అనుకుంటున్నారట! తెలంగాణలో ఉన్న లోక్‌సభ స్థానాలు మొత్తం 17. అంటే ఈ లెక్కన బీసీలకు 34 అసెంబ్లీ స్థానాలను ఇవ్వాల్సి ఉంటుందన్నమాట! ఇందులో కాంగ్రెస్ ఎత్తుగడ కూడా ఉంది. బీఆర్‌ఎస్ పార్టీ కంటే తాము బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామని చెప్పుకోవచ్చు. అలాగే బీసీ ఓట్లను సంపాదించుకోవచ్చు. అయితే బీసీల వాయిస్ మాత్రం మరో విధంగా ఉంది. బీసీ ముఖ్య నాయకులకు కూడా సీట్లు దొరకని పరిస్థితి ప్రస్తుతం ఉందని వారంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించగలదా? బీసీల ఆధిపత్యం ఉన్న స్థానాలు ఎన్ని ఉన్నాయ? ఇలాంటి వివరాలను ఈ వీడియోలో చూద్దాం.