Tamilisai Soundarrajan : గవర్నర్ కు గౌరవం దొరికింది!
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజ్(Tamilisai Soundarrajan) మేడారం సమక్క-సారలమ్మ(Samakka-Saralamma) మహా జాతరలో(Medaram jathara) పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలీకాఫ్టర్‌లో వెళ్లిన గవర్నర్(Governor) వనదేవతల దగ్గర మొక్కలు చెల్లించుకున్నారు. మేడారం జాతరకు వరుసగా మూడోసారి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆమె గవర్నర్‌గా ఛార్జ్ తీసుకున్న తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో అనేక అంశాలలో విభేదాలు వచ్చాయి.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజ్(Tamilisai Soundarrajan) మేడారం సమక్క-సారలమ్మ(Samakka-Saralamma) మహా జాతరలో(Medaram jathara) పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలీకాఫ్టర్‌లో వెళ్లిన గవర్నర్(Governor) వనదేవతల దగ్గర మొక్కలు చెల్లించుకున్నారు. మేడారం జాతరకు వరుసగా మూడోసారి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆమె గవర్నర్‌గా ఛార్జ్ తీసుకున్న తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో అనేక అంశాలలో విభేదాలు వచ్చాయి. తెలంగాణలో పలు ప్రాంతాలలో గవర్నర్‌గా ఆమె పర్యటిస్తున్న
సందర్భంగా కనీసం ప్రోటోకాల్ పాటించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఆమె భద్రాచలం సందర్శనకు వెళ్లినప్పుడు అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. హైదరాబాద్‌లో ఉన్న ఆసుపత్రులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వసతీసదుపాయాలను పరిశీలించారు. ఓ రాజకీయ నేత కంటే ఆమె చాలా యాక్టివ్‌గా పని చేశారు. అలా పనిచేయడం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏర్పడిన విభేదాలే కారణమన్న మాటలు కూడా వినిపించాయి. రెండేళ్ల కిందట ఇదే మేడారం జాతరకు తమిళిసై వెళితే అక్కడ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు లైట్ తీసుకున్నారు. గౌరవించలేదు కూడా! రెండేళ్లు గడిచాయి. పాత ప్రభుత్వం పోయి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా తమిళిసై మేడారం వెళ్లారు. ఈసారి ఆమెకు అక్కడ గౌరవం దక్కింది. మంత్రి సీతక్క ఆమెకు ఎదురెళ్లి స్వాగతం పలికారు.