తెలంగాణ రాజకీయాలలో(Telangana Politics) ప్రస్తుతం అందరి చూపు ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలోని పాలేరు నియోజకవర్గంపై ఉంది. అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఆసక్తి కూడా అందరిలో ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు జనరల్‌ సీట్లు(General seats) ఉన్నాయి. ఇందులో పాలేరు(Paleru) కూడా ఒకటి. మిగతావి కొత్తగూడెం(Kothagudem), ఖమ్మం నియోజకవర్గాలు. ఈ మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి చాలా మంది ఉత్సాహపడుతున్నారు. కాంగ్రెస్‌(congress) పార్టీలో అయితే గట్టి పోటీనే ఉంది.

తెలంగాణ రాజకీయాలలో(Telangana Politics) ప్రస్తుతం అందరి చూపు ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలోని పాలేరు నియోజకవర్గంపై ఉంది. అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఆసక్తి కూడా అందరిలో ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు జనరల్‌ సీట్లు(General seats) ఉన్నాయి. ఇందులో పాలేరు(Paleru) కూడా ఒకటి. మిగతావి కొత్తగూడెం(Kothagudem), ఖమ్మం నియోజకవర్గాలు. ఈ మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి చాలా మంది ఉత్సాహపడుతున్నారు. కాంగ్రెస్‌(congress) పార్టీలో అయితే గట్టి పోటీనే ఉంది. బీఆర్‌ఎస్‌(BRS) ఆల్‌రెడీ అభ్యర్థిని ప్రకటించి కాబట్టి దానిపై చర్చే లేదు. అలాగే బీజేపీకి(BJP) అక్కడ పెద్దగా ఉనికి లేదు కాబట్టి ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా పెద్దగా ఓట్లు పడవు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదే ఉత్కంఠంగా ఉంది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఈ మూడు నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ఖాయం! షర్మిల(Sharmila) కూడా పాలేరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారు. అన్నట్టు తుమ్మల కూడా కాంగ్రెస్‌లో చేరడానికి రెడీ అవుతున్నారు. మరిప్పుడు పాలేరు నుంచి ఎవరు పోటీ చేస్తారు?

Updated On 2 Sep 2023 3:47 AM GMT
Ehatv

Ehatv

Next Story