Nandhamuri Suhasini : ఖమ్మం బరిలో నందమూరి సుహాసిని?
ఖమ్మం(Khammam) లోక్‌సభ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ ఇంకా పెండింగ్‌లోనే పెట్టింది. ఎవరికి ఇవ్వాలన్నదానిపై ఇంకా కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ స్థానాలలో ఖమ్మం మినహా మిగిలినవాటిల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపుగా జరిగింది. మిగిలింది ఖమ్మమే! ఖమ్మంకు సంబంధించి ఓ పెద్ద పీటముడి ఉంది. ఆ ముడిని విప్పడం కాంగ్రెస్ అధినాయకత్వానికి కొంచెం కష్టంగా ఉంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti srinivas) సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి(Ponguleti Prasad) టికెట్ ఆశిస్తున్న వారిలో మొదటివరుసలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా తన ఫ్యామిలీకి టికెట్ కావాలంటున్నారు.
ఖమ్మం(Khammam) లోక్‌సభ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ ఇంకా పెండింగ్‌లోనే పెట్టింది. ఎవరికి ఇవ్వాలన్నదానిపై ఇంకా కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ స్థానాలలో ఖమ్మం మినహా మిగిలినవాటిల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపుగా జరిగింది. మిగిలింది ఖమ్మమే! ఖమ్మంకు సంబంధించి ఓ పెద్ద పీటముడి ఉంది. ఆ ముడిని విప్పడం కాంగ్రెస్ అధినాయకత్వానికి కొంచెం కష్టంగా ఉంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti srinivas) సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి(Ponguleti Prasad) టికెట్ ఆశిస్తున్న వారిలో మొదటివరుసలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా తన ఫ్యామిలీకి టికెట్ కావాలంటున్నారు. భట్టి విక్రమార్క సతీమణి టికెట్ కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్యన గాంధీభవన్‌కు(Gandi bhavan) వందలాది మంది అనుచరులో పెద్ద ఊరేగింపునే తీశారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ముగ్గురు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు. ముగ్గరూ సీనియర్ నాయకులు. అందుకే ఖమ్మం అభ్యర్థి ఎంపిక ఆలస్యమవుతున్నది. భట్టి వర్సస్ పొంగులేటిగా ఖమ్మం టికెట్ వ్యవహారం ఉన్నదని అంటున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇస్తారన్నదానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయ. సాధారణంగా ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా కమ్మ సామాజికవర్గానికి లభిస్తుంటుంది. ఎక్కువగా కమ్మ సామాజికవర్గం వారే ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. తెలంగాణలో ఇంకెక్కడా కమ్మ సామాజికవర్గానికి టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్. మల్కాజ్‌గిరి టికెట్‌ను బండ్ల గణేశ్(Bandla ganesh) ఆశించారు కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు కమ్మవారికి టికెట్ ఇవ్వాలంటే ఖమ్మం ఒక్కటే మిగిలింది. అక్కడ ఆ సామాజికవర్గానికి ఇవ్వాల్సి వస్తే తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్‌కు ఇవ్వవలసి వస్తుంది. అలాగని భట్టి విక్రమార్క సతీమణిని తీసేయడానికి ఏమీలేదు. చాలా కాలంగా ఆమె నియోజకవర్గంలో రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలా ప్రజలకు దగ్గరవుతున్నారు. పొంగులేటి ఫ్యామిలీకి కూడా మంచి పేరే ఉంది. దాంతో పాటు ఓసారి పొంగులేటి విజయం సాధించారు కూడా! అయితే కాంగ్రెస్ అధినాయకత్వం ఈసారి ఈ ముగ్గురూ కాకుండా కొత్తవారికి టికెట్ ఇవ్వాలని అనుకుంటోంది. వారికి నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని గుర్తుకొచ్చింది. 2018 ఎన్నికల్లో ఈమె కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సుహాసినికి ఖమ్మం లోక్‌సభ టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఎవరిది? ఎందుకొచ్చింది? ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం!