KTR Statement On Elections : తెలంగాణ ఎన్నికలు ఏప్రిల్, మే లో జరగవచ్చు
తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ వస్తేనే సమయంలోపు ఎన్నికలు జరుగుతాయని..
తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ వస్తేనే సమయంలోపు ఎన్నికలు జరుగుతాయని.. కానీ ఆ సమయంలోగా నోటిఫికేషన్ వచ్చేది అనుమానమేనన్నారు. తెలంగాణ ఎన్నికలు కూడా ఏప్రిల్, మే లో జరగవచ్చని అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.
అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉన్నదన్నారు. 90 స్థానాలకుపైగా గెలుస్తామని.. కేసీఆర్(KCR) మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు. క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్.. ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. పది సంవత్సరాలల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారని అన్నారు.
ప్రజలకు చాలా స్పష్టత ఉంది, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని అన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తాపత్రయం రెండవ స్థానం కోసమేనన్నారు. సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వకుంటే.. మా దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయని.. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారని వెల్లడించారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.