తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్(Group-1 Prelims) ర‌ద్దు చేసి మ‌ళ్లి నిర్వ‌హించాల‌న్న పిటిష‌న్‌పై విచార‌ణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు(High Court) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది. జూన్‌ 11వ తేదీన జరిగిన ఈ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను కోర్టు ఆదేశించింది.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్(Group-1 Prelims) ర‌ద్దు చేసి మ‌ళ్లి నిర్వ‌హించాల‌న్న పిటిష‌న్‌పై విచార‌ణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు(High Court) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది. జూన్‌ 11వ తేదీన జరిగిన ఈ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను కోర్టు ఆదేశించింది. తెలంగాణలో 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వహించిన విష‌యం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను లీకేజీ కారణాల వలన ఒకసారి రద్దు చేసి మళ్ళీ జూన్ 11వ తేదీన నిర్వహించారు. ఇప్పుడు ఇది రెండవ సారి రద్దు అవ్వడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న సమయంలో పరీక్ష రద్దు అంటూ నిర్ణయం రావడంతో మనోవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్లబోతున్నది? సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా? చూడాలి?

Updated On 23 Sep 2023 7:38 AM GMT
Ehatv

Ehatv

Next Story