ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra modi) పాలమూరు(Palamuri) జిల్లాకు వచ్చారు. రెండు ప్రధానమైన ప్రాజెక్టులను ప్రకటించారు. పసుపు బోర్డు మాట ఇచ్చారు. అలాగే గిరిజన యూనివర్సిటీ(Tribal University) హామీ కూడా ఇచ్చారు. గిరిజన యూనివర్సిటీ ములుగులో ఉంటుందని చెప్పారు మోదీ. పసుపు బోర్డు ఎక్కడ ఉంటుందో మాత్రం చెప్పలేదు. నిజామాబాద్‌ జిల్లాకు ఎలాగూ మోదీ వెళుతున్నారు కాబట్టి అక్కడ పసుపు బోర్డు విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ జిల్లాకు కేటాయిస్తారేమో చూడాలి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra modi) పాలమూరు(Palamuri) జిల్లాకు వచ్చారు. రెండు ప్రధానమైన ప్రాజెక్టులను ప్రకటించారు. పసుపు బోర్డు మాట ఇచ్చారు. అలాగే గిరిజన యూనివర్సిటీ(Tribal University) హామీ కూడా ఇచ్చారు. గిరిజన యూనివర్సిటీ ములుగులో ఉంటుందని చెప్పారు మోదీ. పసుపు బోర్డు ఎక్కడ ఉంటుందో మాత్రం చెప్పలేదు. నిజామాబాద్‌ జిల్లాకు ఎలాగూ మోదీ వెళుతున్నారు కాబట్టి అక్కడ పసుపు బోర్డు విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ జిల్లాకు కేటాయిస్తారేమో చూడాలి. ప్రధాని మాట్లాడిన మాటలు, ప్రసంగపు తీరును పక్కన పెడితే, రాష్ట్ర బీజేపీ చాలా కాలంగా అసంతృప్తులతో ఉడికిపోతున్నది. అసంతృప్తులు రాష్ట్ర బీజేపీని(BJP) అతలాకుతులం చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో ఉన్న లుకలుకలు ప్రజలకు కూడా తెలుస్తున్నది. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను(Bandi Sanjay) తొలగించడం వెనుక కూడా అసంతృప్తులే కారణమన్న మాట అప్పట్లో వినిపించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి(Kishan Reddy) ప్రమాణ స్వీకారం చేస్తున్న సభలోనే బండి సంజయ్‌ తనపై చేసినట్టుగానే కిషన్‌రెడ్డిపై ఫిర్యాదులు చేయకండి అని అన్నారంటే కొందరు నేతలు ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థమవుతుంది. ఇటీవల కొందరు ముఖ్య నేతలు బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. దూరంగా ఏమీ లేము, దగ్గరగా ఉన్నామంటూ ప్రకటనలు చేస్తున్నారు. పార్టీతోనే ఉన్నామని చెబుతున్నారు. పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలపైన తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. అది పార్టీకి కొంత ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ తమ అభిప్రాయాలను మాత్రం చెబుతూ వస్తున్నారు. ఇలా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్న వారిలో విజయశాంతి ప్రథమంగా నిలుస్తున్నారు. కాంగ్రెస్‌లో ప్రచార కమిటీలో ఉన్న విజయశాంతి కొన్నాళ్ల కిందట బీజేపీలో చేరారు. చేరిన కొత్తలో చాలా యాక్టివ్‌గా ఉన్న విజయశాంతి ఈమధ్య పార్టీ కార్యక్రమాలలో కనిపించడం లేదు. ఆమె కొంత అసంతృప్తితో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. వివేక్‌ వెంకటస్వామి కూడా అంతే..! బీజేపీలో చాలా యాక్టివ్‌గా ఉన్న వివేక్‌ ఈ మధ్య చాలా సైలంటయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇలాగే బీజేపీ యాక్టివిటీస్‌కు దూరంగా ఉంటున్నారు. ఆదిలాబాద్‌ ఎంపీగా ఉన్న సొయం బాపురావు కూడా ఈమధ్యన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నలుగురి ఆలోచనలేమిటి? వారు పార్టీలో ఉంటారా? పక్క పార్టీవైపు వారి చూపులు ఉంటున్నాయా? డిటైల్డ్‌గా తెలుసుకుందాం!

Updated On 2 Oct 2023 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story