Election commission : డియర్ ఈసీ, నిద్ర నటిస్తున్నారా.?
ఎన్నికలను(Elections) సీరియస్‌గా నిర్వహిస్తాం..ఎన్నికల్లో అక్రమాలు జరిగితే చర్చలు తీసుకుంటాం..ఎన్నికల్లో ప్రతి ఓటరు హక్కులను పరిరక్షిస్తాం.. ధనం, మద్యం పారకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం...దొంగ ఓట్లు లేకుండా చేస్తాం..ఈ మాటలన్నీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నప్పుడు ఎన్నికల సంఘం(Election Commission) అధికారుల నోటి నుంచి వెలువడ్డాయి.
ఎన్నికలను(Elections) సీరియస్‌గా నిర్వహిస్తాం..ఎన్నికల్లో అక్రమాలు జరిగితే చర్చలు తీసుకుంటాం..ఎన్నికల్లో ప్రతి ఓటరు హక్కులను పరిరక్షిస్తాం.. ధనం, మద్యం పారకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం...దొంగ ఓట్లు లేకుండా చేస్తాం..ఈ మాటలన్నీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నప్పుడు ఎన్నికల సంఘం(Election Commission) అధికారుల నోటి నుంచి వెలువడ్డాయి. ఎన్నికల నోటిఫికేషన్(election notification) వచ్చిన తర్వాత మాత్రం ఎన్నికల సంఘం అధికారులు అన్ని మర్చిపోతున్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ఎన్నికలు సాఫీగా, సజావుగా సాగుతాయి. ఇప్పుడు జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల తీరు తెన్నులను గమనిస్తే ఆశ్చర్యమేస్తుంటుంది. ఎందుకంటే అసెంబ్లీ బరిలో దిగిన అభ్యర్థులు 40 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. 40 లక్షలకు మించితే ఆ అభ్యర్థి విజయం సాధించినా సరే.. ఆ ఎన్నికను రద్దు చేసే అధికారంలో ఈసీకి ఉంది. తెలంగాణలో అభ్యర్థులు పెడుతున్న ఖర్చు నిజంగానే 40 లక్షల రూపాయలలోపు ఉంటుందా? గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా ఎవరైనా? నామినేషన్ వేసిన రెండు రోజులకే ఈజీగా 0 లక్షలు ఖర్చు అయి ఉంటుంది. ఒక్క నామినేషన్ వేసే రోజే 40 నుంచి 50 లక్షల రపపాయలు ఖర్చు పెడుతున్నారు అభ్యర్థులు. ప్రతి రోజూ 40 నుంచి 50 లక్షల రూపాయలను అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రభుత్వం నుంచి వస్తున్న తాయిలాలు.. ఇవన్నీ ఎన్నికల సంఘానికి తెలియదా? తెలిసీ కూడా తెలియనట్టు నటిస్తోందా? మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి,