Telangana CM : రేవంత్‌ను అడ్డుకునేందుకు సీనియర్ల స్కెచ్
తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) ఎవరన్నది ఈ ఆర్టికల్(Article) ప్రచురిస్తున్న సమయం వరకు తేలలేదు. ఫలితాలు వెలువడిన రోజే ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్(Congress) అధినాయకత్వం చెప్పినప్పటికీ ఆ విషయం మాత్రం ఇంకా చర్చల దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) ఎవరన్నది ఈ ఆర్టికల్(Article) ప్రచురిస్తున్న సమయం వరకు తేలలేదు. ఫలితాలు వెలువడిన రోజే ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్(Congress) అధినాయకత్వం చెప్పినప్పటికీ ఆ విషయం మాత్రం ఇంకా చర్చల దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్నదానిపై సందిగ్ధత వీడలేదు. సీఎల్‌పీ సమావేశంలో(CPL Meeting) ఏకవాక్య తీర్మానం చేశారు కూడా! దీన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున(Mallikharjuna) ఖర్గేకు పంపించారు. నిన్న మధ్యాహ్నానికి ఓ నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించారు. కానీ అలా జరగలేదు. సాయంత్రం జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. ఈ రోజు అంటే మంగళవారం నిర్ణయం వస్తుందని అనుకుంటున్నారు. కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలు రేవంత్‌ను(Revanth Reddy) తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. ముందునుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారికే ఆ పదవిని అప్పగించాలని, కొత్తగా వేరే పార్టీలోంచి వచ్చిన వారికి సీఎం పోస్టును ఆప్పగించకూడదని డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, దుబ్బాక ఉప ఎన్నికలో రేవంత్ పార్టీని గెలిపించలేకపోయారని చెబుతున్నారు. అలాగే మునుగోడు, హుజురాబాద్ రేవంత్ పార్టీని గెలిపించలేకపోయారని సీనియర్లు అధిష్టానం ముందు వాదన వినిపించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదని చెప్పారు. నల్గొండ లోక్‌సభ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam kumar Reddy) తన లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్నింటినీ గెలిపించుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి , భట్టి విక్రమార్కలు కూడా తమ చుట్టుపక్కల ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటినీ గెలిపించుకోగలిగారు. పైగా రేవంత్‌పై ఓటుకు నోటు కేసు ఉందని, ఎప్పటికైనా ఆయన జైలుకు వెళ్లవచ్చని చెబుతున్నారు. అసలు సీనియర్ల స్కెచ్ ఏమిటో ఈ వీడియోలో చూడండి.