CM Revanth Reddy : కాంగ్రెస్‌కు మరికొంత మంది రేవంత్‌లు కావాలి!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను(TS Assembly Meetings) చూస్తున్నవారికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయని అర్థమవుతోంది. అసెంబ్లీ సమావేశాలను చాలా కాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చూశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను(TS Assembly Meetings) చూస్తున్నవారికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయని అర్థమవుతోంది. అసెంబ్లీ సమావేశాలను చాలా కాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చూశారు. ప్రతిపక్షంలో హరీశ్‌రావు(Harish Rao), కేటీఆర్(KTR) మాట్లాడుతున్న మాటలను, అధికారపార్టీలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆ స్థానంలో కూర్చోవడం, ఆయన మాట్లాడుతున్న మాటలు .. ఇవన్నీ కచ్చితంగా చాలా ఆసక్తిని కలిగించే విషయాలు. ఇక్కడ మరో విషయం కూడా అర్థమవుతోంది. అధికారపార్టీకి మరికొంత మంది రేవంత్‌రెడ్డిలు ఉంటే బాగుంటుందని అనిపిస్తోంది. విపక్షాల ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి సమాధానాలు, రేవంత్‌రెడ్డి ఫైట్, రేవంత్‌రెడ్డి అటాక్ ప్రతిపక్షం మీద బలమైన ప్రభావాన్ని చూపుతున్నది. అదే స్థాయిలో ప్రతిపక్షం ఎదురుదాడి కూడా కనిపించింది. ప్రతిపక్షం మాటల దాడి చేయడానికి ఎక్కువ అవకాశం దక్కింది. బీఆర్‌ఎస్‌లో(BRS) ఎక్కువ మంది మాట్లాడేవారు ఉన్నారు. పదేళ్లుగా ఏం చేశారన్న ప్రశ్నకు బీఆర్‌ఎస్ దగ్గర గట్టి సమాధానమే ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ శాఖలో ఏం జరిగింది? ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు అన్న విషయాలు బీఆర్‌ఎస్‌కు తెలుసు. అందుకే అధికారపక్షం ఏది అడిగినా జవాబివ్వడానికి బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని స్పష్టం చేసింది కూడా! బీఆర్‌ఎస్ మాటల దాడిని ఎదుర్కోవడానికి రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు సిద్ధంగా ఉంటున్నారు. మిగతావారిలో ఆ స్పార్క్ కనిపించలేదు. వారు కూడా ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చింది. నెమ్మదిగా అలవాటు చేసుకుంటారేమో! ఇప్పుడు కాంగ్రెస్ చేయాల్సిందల్లా మరో పది మంది రేవంత్‌రెడ్డిలను తయారు చేసుకోవడం! విపక్షానికి కౌంటర్లు వేయాలంటే ఇంకా ఎక్కువ మంది రేవంత్‌లు కావాల్సిందే!ఆ అవసరం ఎందుకొచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం!