హుజురాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ నేత‌ ఈటెల రాజేందర్ కు కేంద్ర బ‌ల‌గాల‌చే భ‌ద్ర‌త‌ కల్పించనున్నట్లు తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఈటల రాజేందర్ వ్యాఖ్య‌ల‌ నేపథ్యంలో.. ఆయ‌న‌కు 'వై' కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్రం నిర్ణ‌యంపై త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

హుజురాబాద్‌ ఎమ్మెల్యే(Huzurabad MLA), బీజేపీ నేత‌(BJP Leader) ఈటెల రాజేందర్(Etela Rajender) కు కేంద్ర బ‌ల‌గాల‌చే భ‌ద్ర‌త‌ కల్పించనున్నట్లు తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఈటల రాజేందర్ వ్యాఖ్య‌ల‌ నేపథ్యంలో.. ఆయ‌న‌కు 'వై' కేటగిరీ భద్రత(Y Category Security)ను కల్పించాలని కేంద్ర హోంశాఖ(Home Ministry) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్రం నిర్ణ‌యంపై త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మ‌రోవైపు.. ఈటెల రాజేందర్ హత్య(Murder)కు కుట్ర జరుగుతుందని ఆయన భార్య జమున(Jamuna) కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈటెలను హత్య చేయడానికి రూ.20 కోట్లు కోట్లు ఖర్చు చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి(MLC Kaushik Reddy) అన్నారని.. కేసీఆర్(KCR) ప్రోత్సాహంతోనే కౌశిక్ చెలరేగిపోతున్నారన్నారు. కేసీఆర్ ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతున్నారన్న ఆమె.. కౌశిక్ ను జనంపైకి పిచ్చికుక్కలా వదిలేశారని మండిపడ్డారు.

ఇదిలావుంటే.. ఈటెల రాజేందర్ బీజేపీని వీడి కాంగ్రెస్(Congress) లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) పాత్ర విషయంలో బీజేపీ అధిష్టానం(BJP High Comand) తీరుపై ఈటల అసంతృప్తిగా ఉన్నారని.. అంతేకాకుండా రాష్ట్ర నాయకత్వం ప‌ట్ల కూడా గుర్రుగా ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే.. ఈటెల మాత్రం తాను పార్టీ మారనని స్ప‌ష్టం చేశారు. తాను రోజుకో పార్టీ మారే వ్యక్తిని కాద‌న్నారు. నేను బయటికి వెళ్లాలని మా పార్టీలో కొందరు కోరుకుంటున్నారని.. ఎవరు అలా కోరుకుంటున్నారో మీకు తెలుసు.. అలాంటి చిల్లర గాళ్లను పట్టించుకోనని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Updated On 27 Jun 2023 9:51 PM GMT
Yagnik

Yagnik

Next Story