ఓ మహిళకు పెళ్లయి రెండేళ్లు అవుతుంది. పిల్లలు కలగడం లేదన్న అత్తింటివారి ఒత్తిడితో ఆమె ఓ ఉపాయం పన్నింది.

ఓ మహిళకు పెళ్లయి రెండేళ్లు అవుతుంది. పిల్లలు కలగడం లేదన్న అత్తింటివారి ఒత్తిడితో ఆమె ఓ ఉపాయం పన్నింది. ఆరు నెలల క్రితం తాను గర్భవతిని అయినట్లు నమ్మించింది. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్తున్నాని చెప్పి వెళ్లిపోయింది. 9 నెలలపాటు పొట్టభాగంలో టవల్స్ కట్టుకుంటూ మేనేజ్ చేసింది. అత్తింటివారిని, భర్తను నమ్మించింది. నెలలు నిండాయని, నొప్పులు వస్తున్నాయని చెప్పడంతో మాతాశిశు కేంద్రం ఆస్పత్రిలో చేర్పించారు. బాత్‌రూంకు వెళ్లి అక్కడ ప్రసవం అయిందని, శిశువు డ్రైనేజీలో పడిపోయిందని చెప్పడంతో ఆస్పత్రి ప్రాంగణమంతా వెతకడంతో ఆస్పత్రి వర్గాలకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

ఆస్పత్రి వర్గాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ(jangaon)జిల్లా పాలకుర్తి(Palakurthi) మండలం మొండ్రాయి తండా(MondraiThanda)కు చెందిన ఓ మహిళకు పెళ్లయి రెండేళ్లవుతుంది. ఆరు నెలల కిందట తాను గర్భం దాల్చినట్లు చెప్పి తల్లిగారింటికి వెళ్లిపోయింది. అటు తల్లిగారి కుటుంబాన్ని,ఇటు అత్తగారి కుటుంబాన్ని నమ్మించింది. 9 నెలలపాటు మేనేజ్ చేస్తూ వచ్చింది. సెప్టెంబర్ 11 ఉదయం నొప్పులు వస్తున్నాయని ఇంట్లో వాళ్లకు చెప్పడంతో జనగామ మాతాశిశు ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు. కుటుంబ సభ్యులు వైద్యులతో మాట్లాడుతుండగా బాత్‌రూంకు వెళ్లింది. చాలా సేపటి తర్వాత బయటకు వచ్చింది, బాత్రూం నుంచి బయటకు వచ్చిన మహిళ, వాష్‌రూంలో డెలివరీ అయిందని, శిశువు డ్రైనేజీలో పడిపోయిందని చెప్పింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ ప్రాంతంలో వెతికినా ఆనవాళ్లు కనిపించలేదు. వైద్యులకు మహిళ మీద అనుమానం వచ్చి ఆమెను పరీక్షించగా ఆమె గర్భం దాల్చనట్లు తేలింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సదరు మహిళను విచారించారు. దీంతో ఉన్న విషయం బయట పడింది. అత్తింటివారికి, మహిళకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

ehatv

ehatv

Next Story