వారిద్దరికి ఇన్‌స్టాలో(Instagram) పరిచయం ఏర్పడింది.
వారిద్దరికి ఇన్‌స్టాలో(Instagram) పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడ్డాడు. రానురాను యువకుడి వేధింపులు ఎక్కువయ్యేసరికి ఆ యువతి ఆత్మహత్య(Suicide) చేసుకుంది. దీంతో యువకుడు మనస్తాపం చెందాడు. నువ్వులేక నేను లేను అంటూ చెట్టుకు ఉరివేసుకొని(Hung to tree) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఇన్‌స్టాలో వేధింపులతో యువతి తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. శ్రీహరి అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడని మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. శ్రీహరిపై కేసు నమోదుచేశారు పోలీసులు. తేజస్విని ఆత్మహత్య చేసుకుందన్న వార్త విని తానూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అతడిని మల్లారెడ్డి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. మల్లారెడ్డి ఆస్పత్రి నుంచి శ్రీహరి పరారాయ్యాడు. వెళ్తూవెళ్తూ నోట్ రాశాడు. తేజు.. నీ దగ్గరికే నేను కూడా వస్తున్నా.. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను అని అందులో రాశాడు. దుండిగల్(dundigal) పరిధి బహదూర్‌పల్లి సాయినాథ్ సొసైటీలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అటు తేజస్విని, ఇటు శ్రీహరి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ప్రేమ అనే రెండు అక్షరాలు ఇలా రెండు కుటుంబాల్లో విషాదం నెలకొల్పింది.